factory fire
-
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం
బీజింగ్: చైనాలోని హినాన్ ప్రావిన్స్‌లోని ఒక వస్త్ర పరిశ్రమలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన 240 మంది అగ్నిమాపక సిబ్బంది , 63 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది నాలుగు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. వెన్ఫెంగ్ జిల్లాలోని అన్యాంగ్ సిటీలో సోమవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవ్వలు చెల్లాచెదురుగా నూలు వ్రస్తాలకు మంటలంటుకున్నాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించి దారుణం జరిగిందని పోలీసులు అంచనాకు వచ్చారు. నిబంధనలను ఆ ఫ్యాక్టరీ పూర్తిగా ఉల్లంఘించిందని స్థానిక యంత్రాంగం మండిపడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలని, కారకులను కఠినంగా శిక్షించాలని ఆదేవించారు. అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో చైనాలో ఇంతకుమించిన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తియాంజిన్ నౌకాశ్రయంలో 700 టన్నుల సోడియం సైనేడ్ సహా విషతుల్య రసాయనాలను భద్రపరిచిన భారీ గిడ్డంగికి మంటలంటుకున్నాయి. దాంతో 170 మందికిపైగా మరణించారు. ఇటీవల చైనాలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. చదవండి: కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ! -
పోరస్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహారం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాలపాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిహారం చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్‌కు చెందిన మనోజ్ మోచి, అవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్‌లకు సంబంధించి పరిహారం చెక్కులను వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్ఫి దేవి, రుమాదేవి, శాంతిదేవిలకు రూ.50 లక్షల చొప్పున రూ.2 కోట్లను అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియాస్ సుధీర్ రవిదాస్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను వారి భార్యలైన రేణుదేవి, కంచన దేవి, రింకు దేవిలకు రూ.15 లక్షలను డీఆర్వో సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, ముసునూరు తహశీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 4 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Vadodara Chemical Factory Boiler Blast గుజరాత్: వడోదర ఇండస్ట్రియల్ జోన్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బాయిలర్‌లో శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు జరిగిన పేలుడులో నాలుగేళ్ల బాలిక, 65 ఏళ్ల వృద్ధుడు సహా నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, గాయాలైన తల్లి (30)తోపాటు గాయపడిన వారినందరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారి సాజిద్ బలోచ్ వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల గోడలు కూలడమేకాక, 1.5 కిలోమీటర్ల మేర ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఐతే ఘటనలో మృతి చెందినవారు, గాయపడిన వ్యక్తులు ఫ్యాక్టరీ కార్మికులు, ప్రయాణికులుగా గుర్తించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారుచేసే కాంటన్ లేబొరేటరీస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గుజరాత్లో ఎనిమిది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. డిసెంబర్ 16న పంచమహల్ జిల్లాలో ఇదే తరహాలో ఫ్యాక్టరీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు! -
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం
-
అగ్నిప్రమాదం : 23 మంది సజీవ దహనం
కైరో : ఈజిప్టు కాల్బియ్యా ప్రావిన్స్ ఎల్ ఎబోర్ నగరంలోని ఫర్నీచర్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా బుధవారం వెల్లడించింది. క్షతగాత్రులు నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. ఫర్నీచర్ తయారీకి మండే స్వభావం గల పదార్థాలను ఉపయోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. దాంతో మంటలు సెకన్ల కాలవ్యవధిలో ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయని తెలిపారు. అయితే మంటలు ఆర్పడానికి 23 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని... భారీగా ఎగసి పడుతున్న అగ్నికీలలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయని ఈజిప్టు హోం శాఖ మంత్రి వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆదేశ హోం శాఖ మంత్రి వెల్లడించారు. కాగా ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల చోటు చేసుకుందని భద్రత అధికారులు వెల్లడించారని స్థానిక మీడియా పేర్కొంది.