
వడోదరా : మహిళలు స్విమ్మింగ్ చేస్తుండగా ఫొటోలు తీయటమే కాకుండా, ఫొటోలు తీయవద్దన్నందుకు మహిళలను దూషించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన ఆకాశ్ పటేల్ (30) ఇంటి దగ్గరలో ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సోమవారం ఇంటి బాల్కనీలోకి చేరుకున్న అతడు.. స్విమ్మింగ్ పూల్‌లోని మహిళలను మొబైల్‌లో ఫొటోలు తీయటం ప్రారంభించాడు. ఇది గమనించిన మహిళలు ఫొటోలు తీయవద్దని హెచ్చరించటంతో వారిపై తిట్లదండకం ఎత్తుకున్నాడు. దీంతో ఓ మహిళ ఆకాశ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 354, 294, 506క్రింద అతడిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment