వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరలో స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) క్యాంపస్‌లో టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ రతన్ టాటా ఈ రోజు మన మధ్య ఉండివుంటే, మరింత సంతోషించేవారన్నారు. సీ 295 ఫ్యాక్టరీ కొత్త భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.
టీఏఎస్‌ఎల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన స్నేహితుడు పెడ్రో శాంచెజ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నేటి నుంచి భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం ఏర్పడనుంది. సీ 295 రవాణా విమానాల తయారీ కోసం ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ భారతదేశం- స్పెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌ను బలోపేతం చేయనుందన్నారు.
ఈ సందర్భంగా స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ నేడు మనం ఆధునిక పరిశ్రమను మాత్రమే ప్రారంభించడం లేదని, రెండు ప్రముఖ కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్ట్ ప్రారంభమవడాన్ని చూస్తున్నామన్నారు. భారతదేశానికి, ప్రధాని మోదీ విజన్‌కు ఇది మరో విజయం అని అన్నారు. భారతదేశాన్ని పారిశ్రామిక శక్తిగా మార్చడం, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంపై మోదీ దృష్టి సారించారన్నారు.
ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో
Comments
Please login to add a commentAdd a comment