వ్యాస రచనతో సృజనాత్మకత పెరుగుతుంది | essay writing contests increase Creativity | Sakshi
Sakshi News home page

వ్యాస రచనతో సృజనాత్మకత పెరుగుతుంది

Published Sat, Aug 6 2016 5:51 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

వ్యాస రచనతో సృజనాత్మకత పెరుగుతుంది - Sakshi

వ్యాస రచనతో సృజనాత్మకత పెరుగుతుంది

 చిలుకూరు: వ్యాసరచన పోటీల వల్ల  విద్యార్థుల్లో  సృజనాత్మకత  పెరుగుతుందని జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్‌ అన్నారు. శనివారం చిలుకూరులో ఏఐఎస్‌ఎఫ్‌ 81 వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ– విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన  వ్యాసరచన పోటీల ప్రారంభం కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండల్,  ఉపాధ్యాయులు గుండు ఆదినారాయణ, నాగేశ్వరరావు, మురళి, షరీఫ్,  విద్యార్థి, యువజన  సంఘం నాయకులు  తమ్మనబోయిన నరేష్‌ , ముక్క లక్ష్మీనారాయణ,  రఫి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement