మీ ప్రతి పనిలో కొత్తదనం కోరుకుంటున్నారా?
సెల్ఫ్‌చెక్
ఎప్పుడూ ఒకేలా ఉంటే జీవితం చాలా బోర్ కొడుతుంది. అందుకే మనమంతా రోజువారీ జీవితంలో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకుంటాం. కొందరైతే ఎప్పుడూ ఫ్రెష్‌గా ఆలోచిస్తుంటారు. ఈ ఫ్రెష్ థింకింగే పదిమందిలో గుర్తింపు తెస్తుంది. మీరూ కొత్తగా ఆలోచించగలరా లేక మూసధోరణిలో జీవితాన్ని వెళ్లదీస్తున్నారా... తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్ పూర్తిచేయండి.
1. ఇంట్లో ఫర్నిచర్‌ను ఎప్పుడూ ఒకే స్థలంలో ఉంచకుండా తరచూ మారుస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
2. ఆఫీసులో పనిని అందరిలా కాకుండా కొత్తగా చేయటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
3. ఇబ్బందుల్లో ఉన్నవారికి సూచనలు ఇస్తుంటారు. మీ ఆలోచనలకు చాలా గౌరవం ఉంటుంది.
ఎ. అవును బి. కాదు
4. మీ వృత్తి లాభసాటిగా, ప్రశాంతంగా సాగిపోతున్నా ఇంకా బాగా చేయాలి లేదా సంపాదించాలన్న ఉద్దేశంతో మీ ప్లాన్‌లను అప్‌డేట్ చేస్తుంటారు
ఎ. అవును బి. కాదు
5. క్రియేటివిటీ అంటే మీకు చాలా ఇష్టం. రొటీన్‌కు భిన్నంగా సృజనాత్మకతతో ఉన్న సినిమాలు, పుస్తకాలను బాగా ఇష్టపడతారు.
ఎ. అవును బి. కాదు
6. ఇతరుల మాటల్లో కొత్త విషయాలను గ్రహిస్తూ వాటిని ఉపయోగించుకుంటారు.
ఎ. అవును బి. కాదు
7.ఊహలకు తావివ్వకుండా ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇస్తారు.
ఎ. అవును బి. కాదు
8. కొత్త విషయాలు తెలుసుకోవటం కోసం మీ వృత్తికి సంబంధం లేని కోర్సులు చేయటానికి ఉత్సాహం చూపుతారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు 5 దాటితే మీరు ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించగలరు. అయితే ప్రతి పనినీ భిన్నంగా చేయాలనే పట్టుదలను పెంచుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు అవి నెగెటివ్ ఫలితాలు ఇవ్వచ్చు. ‘బి’ సమాధానాలు ‘4’ కంటే ఎక్కువ వస్తే మీరు భిన్నంగా ఆలోచించటానికి కాస్త ఇబ్బందిపడతారని అర్థం. అనవసర ప్రయోగాలు ఎందుకు చేయాలనే భావన మీలో ఉండవచ్చు.