సాక్షి, హైదరాబాద్: పిల్లల రూమ్ ఇలాగే ఉండాలంటూ రూల్స్ ఏమీలేవు. వారి ఆసక్తులు, అభిరుచులు, లింగ భేదం.. దృష్టిలో ఉంచుకుంటే చాలు. దీనికి తోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు ఉత్సాహాన్నిచ్చేలా కొంచెం సృజనాత్మకతను జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు.
రంగులే కీలకం: పిల్లల గదిని రూపొందించడంలో రంగులదీ ప్రధాన పాత్ర. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గతపరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్ ఉంటే బాగుంటుంది.
పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబట్టి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగజేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో బయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు.
పిల్లలకూ ఉండాలోయ్ ‘ప్రపంచం’
Published Sat, Nov 28 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM
Advertisement
Advertisement