సృజనాత్మక సమ్మేళనం | Creative compound | Sakshi
Sakshi News home page

సృజనాత్మక సమ్మేళనం

Published Thu, Sep 22 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

Creative compound

  • ప్రతిభా పాటవాలకు వేదికగా ‘ఇన్‌స్పైర్‌’
  • ప్రదర్శనలతో అలరించనున్న విద్యార్థులు
  • నేటి నుంచి మూడు రోజుల పాటు పోటీలు
  • వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 330 ఎగ్జిబిట్ల ప్రదర్శన
  • మహబూబాబాద్‌ రూరల్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు  ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలు, ప్రాజెక్టుల పోటీలు ఎంతో దోహదపడుతున్నాయి.  విద్యార్థుల ప్రతిభాపాటవాలు అందరికీ తెలి యాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాపరిశోధన సంస్థ పాఠశాల విద్యాశాఖ జిల్లా ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్‌స ఫర్‌ ష్యూట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీసెర్చ్‌ (ఇన్‌స్పైర్‌) జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన–2016ను మహబూబాబాద్‌ మండలం అనంతారం  మోడల్‌ పాఠశాలలో నిర్వహించనున్నారు.
     
    ఈనెల 22, 23, 24 తేదీల్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌కలాం ప్రాంగణంగా వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శనకు మహబూబాబాద్‌ డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలో ఇన్‌స్పైర్‌ అవార్డులు పొందిన విద్యార్థులు హాజరై తాము తయారు చేసిన ఎగ్టిబిట్లను ప్రదర్శించనున్నారు. మొత్తం 330 వరకు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
     
    కాగా, మహబూబాబాద్‌ డివిజన్‌ ఉపవిద్యాధికారి తోట రవీందర్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొనే విద్యార్థులు, గైడ్‌ టీచర్లకు భోజన, వసతి ఏర్పాట్లు  చేస్తున్నారు. ఇన్‌స్పైర్‌  ఎగ్జిబిట్ల నిర్వహణకు మండల విద్యాశాఖ అధికారులను కన్వీనర్లుగా, పీజీ హెచ్‌ఎంలను కో కన్వీనర్లుగా నియమించడంతో పాటు 16 కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌స్పైర్‌ రిసోర్స్‌ పర్సన్లుగా వి.గురునాథరావు, టి.శ్రీనాథ్, బి. అప్పారావు వ్యవహరించనున్నట్లు డిప్యూటీ ఈఓ రవీందర్‌ తెలిపారు.
    2008లో ప్రారంభం..
    వినూత్న కార్యక్రమంగా పేర్కొనే ఇన్‌స్పైర్‌ను 2008 డిసెంబర్‌లో ప్రారంభించారు. 2009–10 ఏడాది నుంచి పాఠశాల స్థాయి మొదలుకుని పరిశోధన స్థాయి వరకు  అవార్డులు అందజేస్తున్నారు. 2015–16లో ఇన్‌స్పైర్‌ ఆవార్డులు పొందిన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లాస్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నారు. ఒక నిర్ధిష్ట అంశాన్ని ఎంచుకుని వినూత్నంగా ప్రాజెక్టులు తయారు చేయడంతో పాటు సృజనాత్మకత, ఆలోచనలు, భావనలతో నమూనాలు తయారుచేసి విద్యార్థులు ప్రదర్శించనున్నారు. 
    ముఖ్యాంశాలు..
    • చిన్నతనంలోనే విజ్ఞాన శాస్త్రంలో విద్యార్థులకు సృజనాత్మకత వైపు ఆసక్తిని కలిగించి తద్వారా పరిశోధన, అభివృద్ధి ఆధారంగా శాసీ్ర్తయ, సాంకేతిక విధానాలను తెలియజేయడం ఇన్‌స్పైర్‌ ఉద్దేశం
    • ఇన్‌స్పైర్‌లో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హరితహారం, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛభారత్, స్వస్‌్థభారత్‌ అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులను రూపొందించవచ్చు.
    • రెడీమేడ్‌ ఎగ్జిబిట్లు ప్రదర్శించవద్దు.
    • ప్రాజెక్టు నిరే్ధశిత, శాసీ్ర్తయ సూత్రం ఆధారంగా అభివృద్ధి చేయాలి. ప్రాజెక్టు సాధారణ రూపం, అందుకు సంబంధించిన వివరాలు పొందు పర్చాలి.  
    • ప్రాజెక్టు అయినా సరే అందులోని భౌతిక రూపం కంటే శాసీ్ర్తయ సృజనాత్మకత భావనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    • స్థానిక, శాస్త్ర, సాంకేతిక, ప్రాంత అవసరాలకు సంబంధించిన అంశంగా> జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు రూపొందిస్తే ఎంతో మేలు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement