ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బహుమతుల పంట
వేంపల్లె : వేంపల్లె మండలంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైజ్ఞానిక, సృజనాత్మకత రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారని డైరక్టర్ భగవన్నారాయణ తెలిపారు. తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు చేతులమీదుగా విద్యార్థులు పురష్కారాలను అందుకున్నారని తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ‘‘జెడ్‌ఎఫ్ ఇన్నేవేషన్ చాలెంజ్’’ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులను అనేక దశలుగా పరీక్షించి 42బృందాలను క్వార్టర్ ఫైనల్‌కు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ బృందాలకు ప్రజెంటేషన్ పెట్టి సెమీ ఫైనల్‌కు 5బృందాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 24న ఈ ఎంపిక జరిగింది. ఫైనల్‌లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రథమ, తృతీయ స్థానాలలో నిలబడి ట్రిపుల్ ఐటీ వైజ్ఞానిక విజయ దుందుభిని మ్రోగించారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోనే ఈ విద్యార్థులు సృజనాత్మక ఆలోచన దోరణికి జెడ్‌ఎఫ్ టెక్నాలజీ యాజమాన్యం మెచ్చుకొని సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం శుభపరిణామమని ఆర్‌జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య రామచంద్రరాజు తెలిపారు. విద్యార్థుల ప్రొత్సహకానికి ముందుండి నడిపిస్తున్న డైరెక్టర్ భగవన్నారాయణను అభినందించారు. విద్యార్థులను మెచ్చుకున్నారు. ప్రథమ బహుమతిని శివప్రసాద్, సురేంద్ర, దుర్గా ప్రసాద్, ప్రదీప్‌కుమార్ బృందం ‘‘అటానమస్ డ్రైవింగ్ వెహికల్’’ ప్రాజెక్టుకు వీరికి ఈ బహుమతి వచ్చింది. తృతీయ బహుమతిని శివప్రసాద్, శ్రీనాథ బృందం భీమవరం ఎస్‌ఆర్‌కే కళాశాల విద్యార్థి విద్యా సాగర్, కరబ్రహ్మచారి బృందం ‘‘స్మార్ట్ ఇరిగేషన్ మానటరింగ్ సిస్టం అండ్ డ్రైవర్ గ్రోసినెస్ డిబెక్షన్ బై పీపుల్ డిబెక్షన్ రెస్పిక్టివిల్లీ’’ సంయుక్త ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. వీరి ప్రతిభను మెచ్చి డైరెక్టర్లు విశ్వనాథరెడ్డి, భగవన్నారాయణలు అభినందించారు. రాబోవు రోజులలో తమ విద్యార్థుల వైజ్ఞానిక, సాంకేతిక ఖ్యాతిని దేశ విదేశాల్లో మరింతగా ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏవో అమరేంద్రకుమార్, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, అధ్యాపకులు రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.