Viral: UK Man Standing In Queue For Rich Persons, See His Shocking Earning Per Day - Sakshi
Sakshi News home page

UK Man Makes Money Standing In Line: లైన్‌లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!

Published Mon, Jan 17 2022 9:27 PM | Last Updated on Tue, Jan 18 2022 8:41 AM

UK Man Gets Paid Up 16000 Day over Standing Queue Line for Rich People - Sakshi

UK Queuer Earnings: క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చోడమంటే ఎవరికైనా చిరాకే! కానీ ఓ వ్యక్తి క్యూలైన్‌లో నిలబడమే వృత్తిగా మార్చుకున్నాడు. సాధారణంగా ఒకరికోసం ఒకరు క్యూలైన్‌లో నిలబడటం మనం  చూస్తుంటాం. అతను మాత్రం లైన్‌లో నిల్చోవడానికి డబ్బులు తీసుకుంటాడు. 

కొంతమంది ధనవంతులకు సమయం లేక, క్యూలైన్‌లో నిల్చోవడం ఇష్టపడరు. అయితే అలాంటివారందరూ ఫ్రెడ్డీ బెకిట్ కస్టమర్లే. లండన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్ ఈ మధ్య ఇలా ఎనిమిది గంటల పాటు లైన్‌లో నిల్చోని 160 పౌండ్లు(రూ.16,248) సంపాదించాడు. దీంతో ఈ ఘటన ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ఆ ఒక్కరోజు డబ్బున్నవాళ్ల కోసం ‘వీఅండ్‌ఏ డియర్’ ఎగ్జిబిషన్ క్యూలో 8 గంటలు నిలబడి ఉన్నాడు ఫ్రెడ్డీ. నిజానికి ఆ క్యూ లైన్‌ కేవలం మూడు గంటలపాటు మాత్రమే నిలబడాలని కోరారు. కానీ కొందరు టికెట్లు కూడా సేకరించాలనడంతో మరో ఐదు గంటలు అతను క్యూలో నిలబడాల్సి వచ్చింది. అందుకోసం అదనపు ఛార్జ్‌ కూడా వేశాడు. సాధారణంగా గంట లైన్‌లో నిల్చుంటే అతను 20 (సుమారు రూ.2,027) పౌండ్లు ఛార్జ్‌ వేస్తాడు. అయితే ఆ రోజు 8 గంటల పాటు క్యూలో నిలబడటంతో భారీ మొత్తం సంపాదించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement