ధనికులకు గ్యాస్ సబ్సిడీ కట్! | No lpg subsidy for rich people, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

ధనికులకు గ్యాస్ సబ్సిడీ కట్!

Published Sat, Nov 22 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

ధనికులకు గ్యాస్ సబ్సిడీ కట్!

ధనికులకు గ్యాస్ సబ్సిడీ కట్!

 ఆ దిశగా కేంద్రం యోచన: జైట్లీ


 న్యూఢిల్లీ: దేశంలోని ధనికులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచి స్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, హర్షించకపోయినా దేశ శ్రేయస్సు దృష్ట్యా అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉన్నత స్థాయి లో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా సులువుగా పరిష్కారమవుతుందన్నారు. బొగ్గు గనులు, డీజిల్, గ్యాస్ ధరలు, తదితర సమస్యలపై గత ప్రభుత్వాలు వీటిపై ఏళ్లు వృథా చేశాయని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement