
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కేంద్రం మూలధన నిధుల కింద రూ. 980 కోట్లు సమకూర్చనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు పౌర విమానయాన శాఖ.. పార్లమెంటు ఆమోదాన్ని కోరింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 11,698 కోట్ల అదనపు వ్యయాలకు సంబంధించి మంగళవారం కేంద్రం పార్లమెంటు ముందు ఉంచిన సప్లిమెంటరీ గ్రాంట్ ప్రతిపాదనల్లో ఇది కూడా ఉంది.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన 2012 నాటి పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కేంద్రం ఈక్విటీ పెట్టుబడులు సమకూరుస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 650 కోట్లు సమకూర్చింది. సుమారు రూ. 48,000 కోట్ల మేర రుణభారం ఉన్న ఎయిరిండియాకు మొత్తం మీద ఇప్పటిదాకా కేంద్రం రూ. 27.195 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులు అందించింది.
Comments
Please login to add a commentAdd a comment