ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 2022లో 85.7 శాతానికి చేరిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. అంతర్జాతీయంగా చూస్తే ఇది 68.5 శాతం అని తెలిపింది. ‘డిసెంబర్‌తో సహా గతేడాది రికవరీ కొనసాగింది.
దేశీయ ట్రాఫిక్ 2021తో పోలిస్తే 2022లో 48.8 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ గతేడాది 152.7 శాతం దూసుకెళ్లింది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణాలు చేశారు. ఈ ట్రెండ్ 2023లోనూ కొనసాగుతుంది.
అంతర్జాతీయంగా సరిహద్దులు మూసివేయడం, ప్రయాణ పరిమితుల కారణంగా మహమ్మారి వ్యాప్తి వేగానికి కట్టడి వేశారు. అయితే ప్రయాణాలు, సరుకుల రవాణాతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలు, జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపింది’ అని ఐఏటీఏ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment