air travel
-
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్‌ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
గగనతలంలో 17 కోట్ల మంది!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. తీవ్రమైన వేడి గాలులు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాలతో 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలం పాక్షికంగా ప్రభావితమైంది. భారతీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 16.2 శాతంగా ఉందని ఇక్రా వివరించింది. ద్వితీయార్థం పుంజుకోవచ్చు..గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య విమానయాన సంస్థల ఆదాయాలు క్షీణించాయి. విమానాలు నిలిచిపోవడం, అధిక ఇంధన ధరలు ఇందుకు కారణం. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయాలు పుంజుకోవచ్చని అంచనా. ఎయిర్‌లైన్స్ వ్యయాల నిర్మాణం సాధారణంగా రెండు కీలక భాగాలైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, రూపాయి మారకం కదలిక ఆధారంగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే 2024–25 మొదటి ఎనిమిది నెలల్లో సగటు ఏటీఎఫ్ ధరలు 6.8 శాతం తగ్గి కిలోలీటరుకు రూ.96,192కు చేరుకున్నాయి. అయితే కొవిడ్‌కు ముందు కాలం 2019–20 మొదటి ఎనిమిది నెలల్లో ఇది రూ.65,261 నమోదైందని ఇక్రా వివరించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు..మొత్తం వ్యయాల్లో ఇంధన ఖర్చులు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. నిర్వహణ వ్యయాలు 35–50 శాతంగా ఉన్నాయి. విమానాల లీజు చెల్లింపులు, ఇంధన ఖర్చులు, విమానాలు, ఇంజన్ నిర్వహణ వ్యయాలు డాలర్ పరంగా నిర్ణయించబడతాయి. కొన్ని విమానయాన సంస్థలు విదేశీ కరెన్సీ రుణాన్ని కలిగి ఉన్నాయి. దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుగుణంగా ద్వారా వచ్చే ఆదాయాలపై విదేశీ కరెన్సీలో నికర చెల్లింపులు చేయాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!గత నష్టాల కంటే తక్కువగా..దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర వృద్ధి మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై ‘స్థిర(స్టేబుల్)’ రేటింగ్‌ను ఇక్రా కొనసాగించింది. 2024–25లో విమానయాన పరిశ్రమ నష్టం రూ.2,000–రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది. పరిశ్రమ 2025–26లో ఇదే స్థాయిలో నష్టాన్ని నివేదించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ కింజాల్ షా తెలిపారు. -
విమానయానంపై పెరిగిన ఆసక్తి
కర్నూలు(సెంట్రల్): విమాన ప్రయాణంపై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి వైజాగ్, చైన్నె నగరాలకు తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి విమానాశ్రయం అనువుగా ఉంటోంది. సమయం, డబ్బును ఆదా అవుతోంది. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి మూడేళ్లలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి 57,327 మంది కర్నూలుకు రాగా, కర్నూలు నుంచి 63,405 మంది విశాఖపట్నం, బెంగళూరు, చైన్నె మహా నగరాలకు వెళ్లారు.ఎయిర్‌పోర్టు ప్రస్థానమిదీ..ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు. ఈ కోవలోనే కర్నూలు విమానాశ్రయానికి బీజం పడింది. ఇందుకోసం ఓర్వకల్లు సమీపంలో 1,010 ఎకరాలు కేటాయించారు. కేంద్ర విమానయాన శాఖ అనుమతులు రావడంతో 2017లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వసతులు సమకూరిన అనంతరం 2021 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. అప్పటి నుంచి విమానాల రాకపోకలు జోరందుకున్నాయి.ఇవీ సౌకర్యాలు● కర్నూలు–నంద్యాల జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టు చేరుకోవడానికి వీలుగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు.● ప్రయాణికులు, వివిధ వాహనాల రాకపోకలకు వీలుగా నాలుగు ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయి.● 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ (పీటీబీ) ఉంది.● టెర్మినల్‌కు ఎదురుగా నాలుగు విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసేందుకు ఆప్రాన్ నిర్మించారు.● టర్మినల్ బిల్డిండ్ బయట వైపు కనువిందు చేసేలా ఉద్యానవనం అభివృద్ధి చేశారు.విశాఖకు అధికంకర్నూలు నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చైన్నె మహానగరాలకు వారంలో నాలుగు రోజులు విమానాలు వచ్చి వెళ్తున్నాయి. వివిధ కారణాలతో నెలరోజుల నుంచి బెంగళూరు నుంచి వచ్చే విమానాలు రద్దయ్యాయి. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణించగా.. ఇందులో 60 వేల మంది విశాఖ నుంచి వచ్చి వెళ్లిన వారే ఉన్నారు. బెంగళూరుకు 38 వేల మంది, చైన్నెకు 22 వేల మంది ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.విమానయాన శాఖమంత్రి దృష్టి సారించాలి..ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకు విమానాలు తిప్పాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. ఈ మేరకు ఇండిగోతో ఒప్పందం కూడా చేసుకుంది. అయినా ఆ సంస్థ విమానాలను నడిపేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన రామ్మోహన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా ఉన్నారు. కర్నూలు నుంచి తిరుపతి, విజయవాడలకు విమానాలు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా బెంగళూరుకు విమాన సర్వీసులను పునరుద్ధరించాల్సి ఉంది. గతంలో ఫ్లైబిగ్ అనే విమాన సంస్థ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు విమానం నడిపేందుకు ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు విమానాలు తిరిగితే అరగంటలో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
సామాన్యుడు విమానాల్లో వెళ్లాలన్నదే మోదీ కల
సాక్షి, హైదరాబాద్: హవాయి చెప్పులు వేసుకునే సామాన్య వ్యక్తి సైతం విమానాల్లో ప్రయాణించాలన్నదే పీఎం నరేంద్రమోదీ కల అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఉడాన్ పథకంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని పీఎం అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు.గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా, ఏడవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా భారత్ అవతరించిందని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2047 నాటికి విమానయాన రంగంలో 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మానవవనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి: ఇస్లాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌ను మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం ప్రారంభించారు. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై కూలంకుషంగా చర్చించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేసేలా, మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు గెలిపించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విమాన ప్రయాణాల జోరు..
ముంబై: గత నెల దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా నమోదైంది. గతేడాది మే నెలలో నమోదైన 1.14 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం ఇండిగో మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 57.5 శాతం నుంచి 61.4 శాతానికి పెరిగింది. మొత్తం 81 లక్షల మందిని ఇండిగో గమ్యస్థానాలకు చేర్చింది. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారాల మార్కెట్ వాటా వరుసగా 9.4 శాతం, 7.9 శాతం, 9 శాతంగా నిల్చింది. ఎయిరిండియా 12.44 లక్షల మందిని, విస్తారా 11.95 లక్షల మందిని, ఎయిర్ఏషియా ఇండియా 10.41 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ మూడింటికి కలిపి 26.3 శాతం మార్కెట్ వాటా లభించింది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా ఏప్రిల్‌తో పోలిస్తే 4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి విమాన సర్వీసులు నిలిపివేసింది. సమయపాలన విషయంలో ఆకాశ ఎయిర్ అగ్ర స్థానంలో (92.6 శాతం) నిల్చింది. -
రైలెక్కట్లేదు.. విమానం దిగట్లేదు.. ప్రజల్లో వచ్చిన మార్పుకు కారణమిదే!
విమాన ప్రయాణికుల రద్దీపెరిగినంత వేగంగా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగటం లేదు. కోవిడ్–19 కారణంగా క్షీణించిన ప్రజా రవాణా నెమ్మదిగా పుంజుకుంటున్నా.. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి ద్రవ్యోల్బణమే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రయాణాల రద్దీ పెరుగుదల ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ.. కోవిడ్ ముందు సాగినన్ని ప్రయాణాలు ప్రస్తుతం కనిపించటం లేదని స్పష్టం చేస్తున్నారు. కనిపించని మునుపటి మార్క్.. కరోనాకు ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,674 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5,858 మిలియన్ల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే ప్రయాణికుల బుకింగ్ 1,816 మిలియన్లు కంటే ఎక్కువ తగ్గింది. 2022–23తో పోలిస్తే.. 2019–20 కంటే 24 శాతం తక్కువ రద్దీని సూచిస్తోంది. సబర్బన్ ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల ఉండగా.. నాన్–సబర్బన్ ప్రాంతాల్లో 29 శాతం తగ్గుదల నమోదైంది. నేషనల్ ట్రాన్స్పోర్ట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రైల్వే 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి మార్చి (2022–23) వరకు రూ.54,733 కోట్ల రాబడి వస్తే.. గత ఆర్థిక ఏడాదిలో ఇది రూ.31,634 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రైలు ప్రయాణాల్లో వృద్ధి కనిపిస్తున్నా.. 2019–20 కాలం నాటి గణాంకాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణమే కారణం ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆయా వర్గాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగకపోవడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. ఎగువ, ఉన్నత ఆదాయ వర్గాల వారిపై ద్రవ్యోల్బణం పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. ఆ వర్గాల వారు విమానాల్లో యథావిధిగా ప్రయాణించగలుగుతున్నారని చెబుతున్నారు. విమానాలు ఎక్కేస్తున్నారు మరోవైపు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా వృద్ధి చెందుతూ కోవిడ్ ముందునాటి స్థితికి చేరింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన సంస్థలు 1,360 లక్షల మంది ప్రయాణికులను తరలించాయి. ఇది 2021–22లో ప్రయాణించిన 852 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 60 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అయితే, ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీ 2020–21 ఆర్థిక సంవ్సతరంలో 1,415 లక్షల కంటే 4 శాతం తక్కువ. ఈ ఏడాది మార్చిలో 130 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 121 లక్షలు కాగా.. మార్చి నెలలో 8 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2022 మార్చిలో ఇది 106 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 22 శాతం వృద్ధిలో నడుస్తోంది. అదే 2019 మార్చిలో 116 లక్షలు ఉంటే ఇప్పటి మార్చి ప్రీకోవిడ్లో చూస్తే 12 శాతం పెరుగుదల కనిపిస్తోంది. సరుకు రవాణా పెరుగుతోంది దేశంలో అత్యధికంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా చేసిన సంస్థగా రైల్వే రికార్డు సృష్టించింది. జాతీయ రవాణా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022–23లో 1,512 మిలియన్ టన్నుల సరుకును రైల్వే రవాణా చేసింది. 2021–22లో 1,418 మిలియన్ టన్నులు తరలించింది. ఇక్కడ 2022–23లో రైల్వే మొత్తం ఆదాయం రూ.2.44 లక్షల కోట్లు కాగా.. 2021–22లో రూ.1.91 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఏకంగా 27.75 శాతం వృద్ధిని సూచిస్తోంది. – సాక్షి, అమరావతి -
కొత్త పోకడ...రైలెక్కి రయ్.. రయ్
ఇంటి నుంచి కాలు బయట పెడితే విమానాలు ఎక్కడమే వారికి తెలుసు. రయ్యిమంటూ గాల్లో తేలిపోతూ గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు వారిలో కూడా మార్పు వస్తోంది. హాయిగా రాత్రిపూట రైలెక్కి బెర్త్ వాల్చితే ఉదయానికల్లా ఊరు చేరుకోవడంలో ఎంత సదుపాయముందో యూరప్ వాసులు గ్రహించారు. చుకు బుకు చుకు బుకు రైలును, అదిరిపోయే దాని స్టైలును, ఆ ప్రయాణంలోని మజాను ఆస్వాదిస్తున్నారు. విమాన ప్రయాణాలతో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి యూరప్‌లో పలు దేశాలు కూడా రైలు ప్రయాణాలకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో వారు కూడా తక్కువ దూరాలకు విమానానికి బదులుగా రైలు వైపే మొగ్గు చూపిస్తున్నారు... యూరప్‌లో రైలు ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎమ్ వంటివి రైలు రవాణా నెట్‌వర్క్‌లో భాగస్వాములవుతున్నాయి. యూరోపియన్ కమిషన్ కూడా 2021ని ఇయర్ ఆఫ్ యూరోపియన్ రైల్‌గా ప్రకటించి రైలు ప్రయాణికులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పించింది. హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం, రైలు టికెట్ ధరల్ని తగ్గించడం వంటి చర్యలతో ఇప్పుడు చాలామంది రైలు జర్నీయే సో బెటరని అంటున్నారు. ముఖ్యంగా స్వల్ప దూర ప్రయాణాలకు రైళ్లల్లో వెళ్లడానికి యూరప్ పౌరుల్లో 62% మంది ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. 1990 తర్వాత మళ్లీ ఇప్పుడు రాత్రిళ్లు ప్రయాణించే స్లీపర్ రైళ్లకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు... యూరప్‌లో విమాన ప్రయాణాల వల్ల వెలువడుతున్న కాలుష్యం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల 2013–2019 మధ్య ఏడాదికి సగటున 5% చొప్పున నమోదైంది! ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కేవలం స్వల్ప దూరాల విమానాలను మాత్రమే నిరుత్సాహపరుస్తూ అధిక దూరం ప్రయాణించే విమానాలకు ప్రోత్సాహకాలు కొనసాగించడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వచ్చే పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పెదవి విరుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ వాటి కాలుష్యమే అధికం ప్రపంచవ్యాప్తంగా అధిక దూరాలు ప్రయాణించే విమానాల నుంచి వెలువడే కాలుష్యమే ఎక్కువ! జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జియోగ్రఫీ తాజా నివేదిక ప్రకారం 500 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాల యూరోపియన్ యూనియన్‌లో 27.9 % కాగా వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 5.9%. 4 వేల కి.మీ. కంటే అధిక దూరం వెళ్లే విమానాలు కేవలం 6.2% మాత్రమే. కానీ వాటినుంచి వెలువడే కాలుష్యం ఏకంగా 47 శాతం! అలాంటప్పుడు కేవలం తక్కువ దూరాలు ప్రయాణించే విమానాల రద్దుతో ఒరిగే ప్రయోజనాలేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. రైల్వేలకున్న అడ్డంకులివే..! కొన్ని దశాబ్దాలుగా విమాన ప్రయాణానికే అలవాటు పడడంతో చాలా మార్గాల్లో రైలు సదుపాయం లేదు. కొత్త ట్రాక్‌లు నిర్మించడం, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడం వంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. చాలా దేశాల్లో విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాలు ఎక్కువ ఖరీదు. అధిక చార్జీలు కూడా రైలు ప్రయాణానికి అడ్డంకిగా మారింది. యూరప్ రైలు ఆపరేటర్లకు లాభార్జనే ధ్యేయం. మార్కెట్ షేర్ కంటే అధిక లాభాలు ప్రజల నుంచి గుంజాలని చూస్తుంటాయి. ఇవన్నీ రైల్వేల విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయి. ఫ్లైట్ షేమ్ ఉద్యమంతో దశ మారిన రైల్వే యూరప్‌లో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గుచూపించడానికి ఫ్లైట్ షేమ్ ఉద్యమం ప్రధాన కారణం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వీడన్‌కు చెందిన టీనేజ్ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్ 2019లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్యసమితి పర్యావరణ సదస్సుకి హాజరవడానికి ఆమె విమాన ప్రయాణం చెయ్యకుండా అట్లాంటిక్ సముద్రంలో నౌకలో కొద్ది రోజుల పాటు ప్రయాణించి మరీ అమెరికా చేరుకున్నారు. విమానం నడపడానికి భారీగా చమురు ఖర్చు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని అందుకే విమానానికి బదులుగా పడవలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలని గ్రేటా థెన్‌బర్గ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ప్రభావంతో యూరప్ వాసులు విమానాలకి బదులుగా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. యూరప్ దేశాలు తీసుకుంటున్న చర్యలివే... ► జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలన్నీ రైలు ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► తక్కువ దూరం ఉండే మార్గాల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. ఆయా మార్గాల్లో కొత్త రైళ్లను నడపడం ప్రారంభించింది. ► రెండున్నర గంటల కంటే తక్కువ సమయం పట్టే రెండు ఊళ్ల మధ్య రైళ్లలోనే ప్రయాణం చేయడం తప్పనిసరి చేసింది. ► దీని వల్ల దేశీయంగా విమానం ద్వారా వెలువడే గ్రీన్హౌస్ వాయువుల్ని 3% తగ్గించగలిగింది. ► 2020లో ఆస్ట్రియా ప్రభుత్వం రైలులో ప్రయాణిస్తే మూడు గంటల కంటే తక్కువ సమయం పట్టే అన్ని మార్గాల్లోనూ విమానాలను రద్దు చేసింది. ► ఆస్ట్రియాలో 350 కి.మీ. కంటే తక్కువ దూరం విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి 30 యూరోల పన్ను వసూలు చేస్తోంది. ► మరోవైపు 2050 నాటికి 2.5 గంటల కంటే తక్కువ సమయాల్లో వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడానికి స్పెయిన్ సన్నాహాలు చేస్తోంది. -
అందరికీ విమానయోగం
శివమొగ్గ/బెల్గావీ: ‘‘హవాయి చెప్పులేసుకునే సామాన్యులు కూడా హవాయీ జహాజ్ (విమాన) ప్రయాణం చేయగలగాలి. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం కర్నాటకలోని శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత వైమానిక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. ‘‘మున్ముందు మనకు వేలాది విమానాలు అవసరమవుతాయి. వాటిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుంటున్నా భారత్‌లోనే తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు మనమంతా దర్జాగా మేడిన్ ఇండియా విమానాల్లోనే ప్రయాణిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోదీ చెప్పారు. 2014 దాకా దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుంటే గత తొమ్మిదేళ్లలోనే తాము మరో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘2014కు ముందు ఎయిరిండియాను నష్టాలు, కుంభకోణాల సంస్థగా చూసే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి సంస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నూతన భారతదేశానికి ప్రతీకగా విజయపుటంచులు చూస్తోంది’’ అన్నారు. రూ.3,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శివమొగ్గ జిల్లాకే చెందిన కర్నాటక మాజీ సీఎం, బీజేపీ అగ్ర నేత బి.ఎస్.యడియూరప్ప సోమవారం 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో సభికులంతా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మోదీ కోరారు. ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారని, రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. డబుల్ ఇంజన్ సర్కారుకే మరో అవకాశమివ్వాలని కర్నాటక ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. అనంతరం బెల్గావీలో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు కారులో నుంచుని అభివాదం చేస్తూ సాగారు. అభివృద్ధి చేసిన బెల్గావీ రైల్వేస్టేషన్ భవనాన్ని, రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్ల మంది రైతులకు ప్రధాన్‌మంత్రీ కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకంలో 13వ విడతగా రూ.16 వేల కోట్ల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ట్రావెల్ నౌ, పే లేటర్..ఎగిరిపోతే ఎంత బావుంటుంది: ప్రతి నెలా బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెలా బిలియన్ డాలర్లను (రూ.8,200 కోట్లు) ఇందు కోసం వెచ్చిస్తున్నట్టు ఆర్బీఐ అవుట్‌వర్డ్ రెమిటెన్స్ డేటా స్పష్టం చేస్తోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది ఎంతో అధికం కావడం గమనార్హం. 2022-23 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వ్యక్తులు ప్రయాణాల కోసం 9.95 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో ఇలా వెచ్చించిన మొత్తం 4.16 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఇక కరోనా ముందు 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రయాణాల కోసం చేసిన అవుట్‌వర్డ్ రెమిటెన్స్‌లు 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో అవుట్‌వర్డ్ రెమిటెన్స్‌లు 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రయాణించి.. తర్వాత చెల్లించు ‘‘భారతీయులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వియత్నాం, థాయిలాండ్, యూరప్, దుబాయ్, బాలి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు’’అని వీ3ఆన్లైన్ పార్ట్నర్ సపన్ గుప్తా తెలిపారు. ప్రయాణ చార్జీలు అందుబాటులో ఉండడంతో పరిశ్రమ పెద్ద బూమ్‌ను చూస్తున్నట్టు సంకాష్ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్ దహియా పేర్కొన్నారు. ‘‘మా కస్టమర్లలో 5 శాతం మంది అంతర్జాతీయ ప్రయాణాలను ఎంపిక చేసుకుంటున్నారు. యూరప్, బాలి, వియత్నాం, దుబాయి ప్రాంతాలకు భారతీయుల నుంచి డిమాండ్ ఉంది’’అని చెప్పారు. ‘ఇప్పుడు ప్రయాణించు-తర్వాత చెల్లించు’ అనే కాన్సెప్ట్‌కు పర్యాటకులు ఆకర్షితులవుతున్నట్టు దహియా తెలిపారు. నెలవారీ చెల్లింపులపైనా విదేశాలను చూసి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
కోవిడ్ ముందస్తుకన్నా తక్కువే!
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 2022లో 85.7 శాతానికి చేరిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. అంతర్జాతీయంగా చూస్తే ఇది 68.5 శాతం అని తెలిపింది. ‘డిసెంబర్‌తో సహా గతేడాది రికవరీ కొనసాగింది. దేశీయ ట్రాఫిక్ 2021తో పోలిస్తే 2022లో 48.8 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ గతేడాది 152.7 శాతం దూసుకెళ్లింది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణాలు చేశారు. ఈ ట్రెండ్ 2023లోనూ కొనసాగుతుంది. అంతర్జాతీయంగా సరిహద్దులు మూసివేయడం, ప్రయాణ పరిమితుల కారణంగా మహమ్మారి వ్యాప్తి వేగానికి కట్టడి వేశారు. అయితే ప్రయాణాలు, సరుకుల రవాణాతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలు, జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపింది’ అని ఐఏటీఏ వివరించింది. -
9 ఎయిర్‌పోర్టులు .. 50 శాతం వృద్ధి
ముంబై: విమాన ప్రయాణీలకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న తొమ్మిది ఎయిర్‌పోర్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధించనున్నాయి. వాటి ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,450 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 9,650 కోట్లకు చేరనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్యాసింజర్ ట్రాఫిక్ ఈసారి 70 శాతం వృద్ధి చెందనుంది. కరోనా పూర్వ స్థాయిలో 93 శాతానికి చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది కోవిడ్ పూర్వ స్థాయికి 1.12 రెట్లు అధికంగా నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ ట్రాఫిక్‌లో 50 శాతం వాటా ఉన్న తొమ్మిది పీపీపీ విమానాశ్రయాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసిన మీదట ఈ అంచనాలకు వచ్చినట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. కోవిడ్ సమయంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు ఆదాయ పంపకంపరంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఊరటనివ్వడంతో 2021–22లో వాటి స్థూల మార్జిన్లు మెరుగ్గా 56 శాతం స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఆదాయ పంపకాన్ని పునరుద్ధరించడంతో ఈసారి ఇవి 37 శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాల స్థాయి పెరగడం వల్ల ఈ మార్జిన్లు సుమారు 45 శాతం వద్ద స్థిరపడవచ్చని కేర్ఎడ్జ్ రేటింగ్స్ పేర్కొంది. ప్రైవేటీకరణలో మరింత జాప్యం.. విమానాశ్రయాల ప్రైవేటీకరణలోనూ, జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టుల నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికల అమల్లోనూ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద 25 ఎయిర్‌పోర్టులను మానిటైజ్ చేయాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా ఇంకా పటిష్టమైన చర్యలేమీ అమలవుతున్నట్లు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులను మరింత ముందుకు జరపవచ్చని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. భారత జీడీపీ వృద్ధి, విమాన ప్రయాణీకుల పెరుగుదలపై దాని ప్రభావం.. పని చేయగలిగే వయస్సు గల జనాభా సంఖ్య పెరుగుతుండటం తదితర అంశాలు భారతీయ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సానుకూలంగా ఉండగలవని వివరించింది. సకాలంలో టారిఫ్ ఆర్డర్లను జారీ చేస్తూ నియంత్రణపరమైన పరిస్థితులను మెరుగుపర్చగలిగితే ఆపరేటర్లకు ఆదాయ అంచనాలపరంగా ఊరటగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ’లో బేస్ ఎఫెక్ట్’ కారణంగా 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి రేటు .. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకన్నా 2.25 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు కేర్ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ పేర్కొన్నారు. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
దూసుకెళ్తున్న విమానం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విమాన ప్రయాణం వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతున్నారు. కోవిడ్ సమయంలో పూర్తిగా వెనక్కి తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కళకళలాడుతోంది. నెలరోజులుగా 90–95 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. దీంతో విమానయాన సంస్థలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రోజుకు 2,500 మందికిపైగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దేశీయ విమాన సర్వీసులివే.. కరోనా పరిస్థితుల్లో వందేభారత్ మిషన్‌లో భాగంగా కొన్ని విమాన సర్వీసులు మాత్రమే నడిచాయి. గతంలో విజయవాడ విమానాశ్రయం నుంచి 36 విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవి. కరోనా పరిస్థితులు క్రమంగా కనుమరుగవుతుండటం, వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే విమానాల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా ప్రస్తుతం 18 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌కి ఏడు, బెంగళూరుకి ఐదు, చెన్నైకి రెండు, విశాఖపట్నం, ఢిల్లీ, తిరుపతి, కడపలకు ఒక్కొక్క సర్వీసు నడుస్తున్నాయి. చెన్నై వెళ్లే విమాన సర్వీసుల్లో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, కడప, ఢిల్లీ విమాన సర్వీసులు 93 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే మరిన్ని సర్వీసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులివే.. విజయవాడ విమానాశ్రయం నుంచి మూడు అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ నుంచి మస్కట్, కువైట్, షార్జాలకు విమాన సర్వీసులున్నాయి. ఈ నడిచే సర్వీసుల్లో సైతం 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంటోంది. త్వరలో కొత్త సర్వీసులు విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో మరిన్ని సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి ముంబైకి, తిరుపతికి వారంలో నాలుగు రోజులు మాత్రమే విమాన సర్వీసు ఉంది. దీన్ని రోజు రెగ్యులర్‌గా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం ఢిల్లీ వెళ్లే సర్వీసు సాంకేతిక సమస్యతో ప్రస్తుతం నడవటం లేదు. త్వరలో దాన్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడినుంచి నడిచే విమాన సర్వీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వేసవి కావడంతో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. త్వరలో విజయవాడ విమానాశ్రయం నుంచి మరిన్ని కొత్త సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – పి.వి.రామారావు, ఏపీడీ, గన్నవరం -
విమాన చార్జీలకు రెక్కలు
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులను 9.83 శాతం – 12.82 శాతం మేర పెంచుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 40 నిమిషాల లోపు వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి రూ. 2,600 నుంచి రూ. 2,900కి (11.53 శాతం) పెంచింది. అలాగే గరిష్ట పరిమితిని 12.82 శాతం పెంచడంతో ఇది రూ. 8,800కి చేరింది. అలాగే 60–90 నిమిషాల వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి 12.5 శాతం పెరిగి రూ. 4,500కి, గరిష్ట చార్జీ 12.82 శాతం మేర పెరిగి రూ. 13,200కి చేరినట్లవుతుంది. మొత్తం మీద ఇకపై 90–120, 120–150, 150–180, 180–210 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉండే దేశీ ఫ్లయిట్ల కనిష్ట చార్జీల పరిమితి వరుసగా రూ. 5,300, రూ. 6,700, రూ. 8,300, రూ. 9,800గాను ఉంటుంది. కరోనా వైరస్ కట్టడి కోసం గతేడాది రెండు నెలల పాటు విధించిన లాక్డౌన్ ఎత్తివేశాక మే 25 నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సంక్షోభం లో ఉన్న ఎయిర్‌లైన్స్‌ని గట్టెక్కించే ఉద్దేశంతో ప్రభుత్వం కనిష్ట చార్జీలపైన, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు గరిష్ట చార్జీలపైనా కేంద్రం పరిమితులు విధించింది. -
నేడు కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం
-
నేడు కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆదివారం కర్నూలు నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి. ముందుగా కర్నూలు నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక ఇండిగో సంస్థకు చెందిన విమానం(6ఈ7911) బెంగళూరు నుంచి ఆదివారం ఉదయం 09.05కి బయల్దేరి 10.10కి కర్నూలుకు చేరుకుంటుంది. కర్నూలు నుంచి 6ఈ7912 అనే నంబర్ కలిగిన విమానం ఉదయం 10.30కి బయల్దేరి మధ్యాహ్నం 12.40కి విశాఖ చేరుకుంటుంది. అలాగే 6ఈ7913 అనే నంబర్ కలిగిన మరో విమానం విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి కర్నూలుకు 2.55కి చేరుకుంటుంది. 6ఈ7914 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి మధ్యాహ్నం 3.15కి బయల్దేరి సాయంత్రం 4.25కి బెంగళూరు చేరుకుంటుంది. 6ఈ7915 అనే నంబర్ కలిగిన విమానం చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి కర్నూలుకు 4.10కి, 6ఈ7916 అనే నంబర్ కలిగిన విమానం కర్నూలు నుంచి సాయంత్రం 4.30కి బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది. కాగా, ప్రయాణికుల నుంచి కూడా స్పందన బాగుంది. బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చేందుకు 52 మంది, కర్నూలు నుంచి విశాఖ వెళ్లేందుకు 66 మంది, విశాఖ నుంచి కర్నూలుకు 31 మంది, కర్నూలు నుంచి బెంగళూరుకు 63 మంది, చెన్నై నుంచి కర్నూలుకు 16 మంది, కర్నూలు నుంచి చెన్నైకి 32 మంది బుక్ చేసుకున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 వరకు విమాన ప్రయాణం చేసేందుకు బుక్ చేసుకున్న వారి వివరాలను ఇండిగో ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అలాగే విమాన టికెట్ల ధరలు ప్రస్తుతం కర్నూలు–బెంగళూరు మధ్య రూ.2,077, చెన్నైకి రూ.2,555, విశాఖకు రూ.3,077గా ఉన్నాయి. -
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న విమాన ఛార్జీలు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఎ.ఎస్.ఎఫ్) ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు రూ.160 నుంచి రూ.200కు, అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2021 నుంచి విమాన టిక్కెట్లపై వర్తిస్తాయి. గత రెండు నెలలుగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జారీ చేసిన ఉత్తర్వులలో.. వివిధ వర్గాలలో ఉన్న కొద్దిమంది ప్రయాణీకులకు ఈ రుసుము చెల్లింపు విషయంలో మినహాయింపు ఉంది. వీరిలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని మార్చి 31, 2021 నుంచి 2021 ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు పొడగించినట్లు గమనించాలి. అయితే, ఇది కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు. చదవండి: ఎలోన్ మస్క్ టెస్లా విషయంలో కీలక నిర్ణయం! వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
విమాన టికెట్ల ధరలను నియంత్రిస్తున్నాం
-
కరోనా కొనసాగితే కష్టమే..
కరోనా మహమ్మారి మనిషికి పరిచయమై 4 నెలలు కూడా కాలేదుగానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలను బలితీసేసుకుంది. ఇంక కొన్ని రోజుల్లోనే అంతా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు కొంచెం భిన్నంగానే ఉన్నాయి. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం నిలిచిపోయినా అది ఒక్కసారిగా జరగదని దశలవారీగా అప్పుడప్పుడూ మళ్లీ విరుచుకుపడటం తప్పదని ఎపిడమాలజిస్టుల అంచనా. ఈ నేపథ్యంలో కరోనా ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే అమెరికా వంటి దేశాల్లో ఆగస్టుకల్లా సమస్య సమసిపోతుందని అంచనా. అయితే ఇలా కాకుండా వచ్చే ఏడాది వరకూ కొనసాగితే మాత్రం విపరీత పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది. ఆహారం, వినోదం, ఆరోగ్య సేవల వంటి వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. వినోదం విషయానికి వస్తే ఇప్పటికే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. కాబట్టి కొత్త సినిమాలు ఇప్పట్లో వచ్చే సూచనలు లేవు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలావరకూ ఆన్లైన్లో నేరుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. షూటింగ్‌లు జరగకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు. మరోవైపు కరోనా దీర్ఘకాలం కొనసాగితే దేశాల అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే రూ. లక్షల కోట్లు ఖర్చు చేసింది. టెస్టింగ్, చికిత్సల కోసం భారత్ కూడా భారీగా ఖర్చు పెడుతోంది. పాఠశాలలు ఏడాదిన్నరపాటు పనిచేయకపోతే విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. హైస్కూల్ స్థాయి పరీక్షలు జరగకపోతే పై తరగతులకు అంటే కాలేజీలకు అడ్మిషన్లు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఆన్లైన్లో తరగతుల నిర్వహణ సాధారణమైపోతుంది. హోటళ్లు, బార్లు, నైట్‌క్లబ్‌లు, జిమ్‌లు, సినిమా, ఆర్ట్ గ్యాలరీలు, షాపింగ్ మాల్స్, మ్యూజియంలు, సంగీత కళాకారులు, క్రీడాకారులు, సదస్సు నిర్వాహకులు తీవ్రంగా దెబ్బతింటారని అంచనా. ఇదే సమయంలో విమాన ప్రయాణాలు తగ్గుతాయి. కరోనా కారణంగా మరణాలు కూడా ఊహించనంత పెరిగిపోతాయనడంలో సందేహం లేదు! -
జీవితాంతం ఫుడ్ ఫ్రీ..
విమానంలో పాప పుట్టింది.. ఆ పాపకు జీవితాంతం మా విమానంలో ప్రయాణం ఫ్రీ.. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడూ మనం ఎప్పుడో ఓసారి చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సంఘటనే ఇటీవల అమెరికాలో జరిగింది. అదేంటంటే ఓ హోటల్లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫాలన్ గ్రిఫిన్ నిండు గర్భిణి. భర్తతో కలసి తన స్నేహితురాలి పిల్లలను ఇంటి వద్ద వదిలివచ్చేందుకు వెళుతున్నారు. టెక్సాస్‌లోని శాన్‌ఆంటోనియోలో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముందుకు రాగానే ఆమెకు తీవ్రంగా నొప్పులు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ స్టోర్ డైరెక్టర్ ఎన్రిక్ వచ్చి సాయం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఫాలన్. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎన్రిక్ చెప్పింది. ఆ పాపకు జీవితాంతం వారి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో ఫుడ్ ఫ్రీగా ఇస్తామని, ఆ పాపకు 14 ఏళ్లు రాగానే ఏదైనా ఉద్యోగం కూడా ఇస్తామని యాజమాన్యం సంతోషంగా ప్రకటించింది. -
‘ఆటో కంటే విమానయానమే చౌక’
ఇండోర్: దేశంలో ఆటోల కంటే విమానాల్లో ప్రయాణమే చౌకగా మారిందని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇండోర్ మేనేజ్మెంట్ అసోసియేషన్ శనివారం నాడిక్కడ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో సిన్హా మాట్లాడారు. ‘ప్రస్తుతం భారత్‌లో విమానాల్లో ప్రయాణం ఆటో రిక్షాల కంటే చౌకగా మారింది. కొందరు వ్యక్తులు నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటారు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఈ రోజుల్లో ఇండోర్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లాలంటే కిలోమీటర్‌కు రూ.5 వరకూ అవుతోంది. అదే ఆటోలో వెళ్లాలంటే కి.మీకు రూ.8–10 ఖర్చు చేయాల్సి వస్తుంది’ అని సిన్హా తెలిపారు. -
అక్టోబరు నుంచే షిర్డీకి విమాన ప్రయాణం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు షిర్డీకి విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. నూతనంగా ఏర్పాటైన షిర్డీ విమానాశ్రయాన్ని అక్టోబరు 1న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ నుంచి అక్టోబరు రెండో వారంలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ హైదరాబాద్–షిర్డీ మధ్య ఈ సర్వీసులు అందించనుంది. తొలుత రోజుకు ఒక ఫ్లైట్ నడుపుతుంది. ప్రయాణికుల సంఖ్యను బట్టి సర్వీసుల సంఖ్య పెంచాలని ట్రూజెట్ భావిస్తోంది. విజయవాడ నుంచి సైతం విమాన సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు నగరాల నుంచి టికెట్ ధర రూ.3,000–6,500 మధ్య ఉండొచ్చు. ఇక ముంబై నుంచి అలయన్స్ ఎయిర్ షిర్డీకి విమాన సర్వీసులు నడపనుంది. అక్టోబరు 1న సర్వీసు ప్రారంభం అయినప్పటికీ, అక్టోబరు 2 నుంచే వాణిజ్యపరంగా సేవలు మొదలవుతాయి. ఇండిగో సైతం కొత్త విమానాశ్రయంలో అడుగు పెట్టనుంది. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసింది. మొత్తం రూ.350 కోట్ల వ్యయం కాగా, సాయి బాబా సంస్థాన్ రూ.50 కోట్లు సమకూర్చింది. -
విమాన ప్రయాణం.. డిజిటల్ మయం!!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్, ఆధార్ ఉంటే చాలు ఇక విమానయానాన్ని సులభంగా చేసేయెచ్చు. మరి టికెట్ అవసరం లేదా? అని మీకు డౌట్ రావొచ్చు. టికెట్ తప్పనిసరి. అయితే ఫోన్, ఆధార్ సాయంతో ఎయిర్ ట్రావెల్‌ను డిజిటలైజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. అంటే ఇక్కడ కాగితంతో పనిలేదు. అన్నీ డిజిటల్ అన్నమాట. ఎయిర్పోర్ట్ ఎంట్రీ, టికెట్ వంటివన్నీ డిజిటలైజ్ అవుతాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ ‘డిజి యాత్ర’ కార్యక్రమంలో భాగంగా బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ ఇంటరాక్షన్స్‌ను డిజిటల్ చేయాలని ప్రయత్నిస్తోంది. పూర్తి విమాన ప్రయాణాన్ని డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ‘ప్రయాణికుల పేమెంట్స్, బోర్డింగ్, సెక్యూరిటీ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా డిజటల్‌మయం అవుతాయి. కాగితంతో ఎలాంటి అవసరం ఉండదని, ప్రయాణికులను అధికారులు ఆధార్, పాస్‌పోర్ట్ తదితరాల ద్వారా గుర్తిస్తారని తెలిపారు. కొన్ని నెలల్లో అనుకున్నవన్నీ కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. నో–ఫ్లై లిస్ట్‌ను కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉందన్నారు. అంటే ఎవరైనా వికృత చేష్టలకు పాల్పడటం, అతిగా ప్రవర్తించడం వంటివి చేస్తే.. విమానంలోని ఇతర ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వారి ప్రయణాన్ని రద్దు చేస్తారు. వారి పేర్లను ఈ నో–ఫ్లై జాబితాలో ఉంచుతారు. -
విమానమెక్కడానికీ ఆధార్ కావాలా?
న్యూఢిల్లీ : ఆధార్... ప్రస్తుతం అన్నింటికీ ఆధారమవుతోంది. ఇటీవలే పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి, మొబైల్ నెంబర్లకు ఆధార్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత విమానమెక్కడానికి ఇక ఆధార్ కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ పోర్టులో ప్రయాణికుల కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ యాక్సస్ బ్లూప్రింట్ ను అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం టెక్ దిగ్గజం విప్రోను ఆదేశించిందట. దీనికి సంబంధించిన రిపోర్టును విప్రో మే నెల మొదట్లో ప్రభుత్వం ముందుంచనుంది. విప్రో ఈ రిపోర్టును సమర్పించిన అనంతరం నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా దేశీయ విమానాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరి నుంచి ఎయిర్ పోర్టులో వేలిముద్రలు తీసుకోవడం ప్రారంభిస్తారు. వివిధ ఎయిర్ పోర్టు అథారిటీలు, ఎయిర్ లైన్స్ తో ఇటీవలే ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా, ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్ పోర్టులో బయోమెట్రిక్ యాక్సస్ పై చర్చించారు. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు ఆధార్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుందని ఏఏఐ చీఫ్ చెప్పారు. విమానమెక్కడానికి ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు ప్రయాణికుల దగ్గర్నుంచి టచ్ ప్యాడ్ లో వారి వేలిముద్రను తీసుకోనున్నారు. చెకిన్ ప్రాసెస్ లో భాగంగా లోపల కూడా ఇదే తరహా ప్రక్రియను చేపట్టనునున్నారని మోహపత్ర చెప్పారు.. -
ఫాల్కన్ పక్షుల కోసం.. విమానమే బుక్ చేశాడు!
రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. యువరాజు తలుచుకుంటే విమాన టికెట్లకు కొదవా అనుకోవాలి. సౌదీ అరేబియాకు చెందిన ఓ యువరాజు తాజాగా తన వద్ద ఉన్న 80 ఫాల్కన్ పక్షుల కోసం ఏకంగా ఓ విమానంలో 80కి పైగా టికెట్లు కొనేశాడు. దీనికి సంబంధించిన ఫొటో రెడిట్ అనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లకు గంతలు కట్టిన ఫాల్కన్ పక్షులు విమానంలో ప్రయాణికుల సీటులోనే కూర్చుని దర్జాగా ప్రయాణం చేశాయి. ప్రతి పక్షిని కూడా ప్రయాణంలో పడిపోకుండా జాగ్రత్తగా సీట్లకు కట్టారు. రెడిట్‌లో ఉన్న లెన్సూ అనే యూజర్ ఈ ఫొటోను పోస్ట్ చేశారు. తన కెప్టెన్ స్నేహితుడు పంపినట్లు అందులో చెప్పారు. మొత్తం 80 పక్షులకు కూడా టికెట్లను సదరు యువరాజు కొన్నట్లు సౌదీ మీడియా పేర్కొంది. యూఏఈ జాతీయ పక్షి అయిన ఫాల్కన్లను ఒకచోటు నుంచి మరో చోటుకు ఇలా తరలించడం మధ్యప్రాచ్యంలో కొత్తేమీ కాదు. యూఏఈలో వాటికి సొంతగా ఫారెస్ట్ గ్రీన్ పాస్‌పోర్టులు కూడా ఇస్తారు. వాటి సాయంతో అవి బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ సౌదీ అరేబియా, పాకిస్థాన్, మొరాకో, సిరియా లాంటి దేశాలకలు వెళ్లచ్చు. తమ విమానాల్లోని ఎకానమీ క్లాసులో గరిష్ఠంగా ఒకసారి ఆరు ఫాల్కన్ పక్షులను తీసుకెళ్లొచ్చని ఖతార్ ఎయిర్వేస్ సంస్థ చెబుతోంది.