
మలేషియా ఎయిర్‌లైన్స్‌లో ప్రీమియం మీల్స్
న్యూఢిల్లీ: ఎకానమీ తరగతి ప్రయాణికుల కోసం మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక మీల్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులు కొంత మొత్తం అదనంగా చెల్లించడం ద్వారా కాంప్లిమెంటరీగా ఇచ్చే భోజనం బదులు ప్రీమియం ‘ఎంహెచ్ గోర్మెట్’ మీల్‌ను పొందవచ్చని తెలి పింది. ఇందులో ప్రాన్ పికాటా, చికెన్ కార్డన్ బ్లూ వంటి ఆరు రకాల వంటకాలు ఉంటాయని వివరించింది.
ఈ మీల్స్ ధర 70 మలేషియన్ రింగిట్స్ (సుమారు రూ. 1,295) అయినప్పటికీ వచ్చే నెల 3 దాకా ప్రారంభ ఆఫర్ కింద 49 రింగిట్స్‌కే (సుమారు రూ. 906) అందిస్తున్నట్లు మలేషియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అలాగే, ఆన్ ఎయిర్ సెలబ్రేషన్ ఆఫర్ కింద విమానప్రయాణంలోనే పుట్టిన రోజు వంటి వేడుకలు జరుపుకోదల్చుకునే వారు కేక్‌లు లాంటివి ప్రీ-ఆర్డరు చేయవచ్చని సంస్థ పేర్కొంది. ఈ కేక్‌ల ధర 250 మలేషియన్ రింగిట్స్ (దాదాపు రూ. 4,625) ఉంటుందని వివరించింది. ఆస్ట్రేలియా, ఆసి యా, మధ్యప్రాచ్యం రూట్లలో ఈ ఆఫర్లు పొందవచ్చు.