విమానమెక్కడానికీ ఆధార్ కావాలా?
విమానమెక్కడానికీ ఆధార్ కావాలా?
Published Wed, Apr 5 2017 4:12 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
న్యూఢిల్లీ : ఆధార్... ప్రస్తుతం అన్నింటికీ ఆధారమవుతోంది. ఇటీవలే పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి, మొబైల్ నెంబర్లకు ఆధార్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత విమానమెక్కడానికి ఇక ఆధార్ కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ పోర్టులో ప్రయాణికుల కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ యాక్సస్ బ్లూప్రింట్ ను అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం టెక్ దిగ్గజం విప్రోను ఆదేశించిందట. దీనికి సంబంధించిన రిపోర్టును విప్రో మే నెల మొదట్లో ప్రభుత్వం ముందుంచనుంది. విప్రో ఈ రిపోర్టును సమర్పించిన అనంతరం నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.
ఈ ప్రక్రియలో భాగంగా దేశీయ విమానాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరి నుంచి ఎయిర్ పోర్టులో వేలిముద్రలు తీసుకోవడం ప్రారంభిస్తారు. వివిధ ఎయిర్ పోర్టు అథారిటీలు, ఎయిర్ లైన్స్ తో ఇటీవలే ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా, ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్ పోర్టులో బయోమెట్రిక్ యాక్సస్ పై చర్చించారు. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు ఆధార్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుందని ఏఏఐ చీఫ్ చెప్పారు. విమానమెక్కడానికి ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు ప్రయాణికుల దగ్గర్నుంచి టచ్ ప్యాడ్ లో వారి వేలిముద్రను తీసుకోనున్నారు. చెకిన్ ప్రాసెస్ లో భాగంగా లోపల కూడా ఇదే తరహా ప్రక్రియను చేపట్టనునున్నారని మోహపత్ర చెప్పారు..
Advertisement