‘ఆధార్’పై సుప్రీంకోర్టు సీరియస్
‘ఆధార్’పై సుప్రీంకోర్టు సీరియస్
Published Fri, Apr 21 2017 1:02 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
న్యూఢిల్లీ : ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తోంది కేంద్రం. సుప్రీంకోర్టు ఆధార్ను ఆప్షనల్గా పెట్టినా.. దాన్ని తప్పనిసరి నిబంధనగా చేరుస్తూ సుప్రీం ఆదేశాలకు కేంద్రం తూట్లు పొడుస్తోంది. ఈ విషయంలో కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పాన్ కార్డు పొందడానికి ఆధార్ కార్డును ఎలా తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తాము ఆప్షనల్గా చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు, తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారని మండిపడింది. అయితే ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఉన్న ఒకానొక్క ఆప్షన్ అని అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు.
షెల్ కంపెనీలకు ఫండ్స్ తరలించిన వాడుతున్న చాలా పాన్ కార్డులను తాము గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఫండ్స్ అక్రమ తరలింపు నిరోధించడానికి ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఒకానొక్క ఆప్షన్ అని చెప్పారు. అయితే బలవంతం మీద ఆధార్ ను తీసుకురావడం ఒకటే మార్గమమా? అని సుప్రీం ప్రశ్నించింది. గత నెల సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు అకౌంట్లకు, పాన్ కార్డుకు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఆధార్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణ ఏప్రిల్ 25న చేపట్టనున్నట్టు సుప్రిం చెప్పింది. సామాజిక పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయొద్దంటూ అంతకమునుపే సుప్రీం తీర్పునిచ్చింది.
Advertisement