
విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా
ఇండోర్: దేశంలో ఆటోల కంటే విమానాల్లో ప్రయాణమే చౌకగా మారిందని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇండోర్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ శనివారం నాడిక్కడ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో సిన్హా మాట్లాడారు. ‘ప్రస్తుతం భారత్‌లో విమానాల్లో ప్రయాణం ఆటో రిక్షాల కంటే చౌకగా మారింది. కొందరు వ్యక్తులు నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటారు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఈ రోజుల్లో ఇండోర్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లాలంటే కిలోమీటర్‌కు రూ.5 వరకూ అవుతోంది. అదే ఆటోలో వెళ్లాలంటే కి.మీకు రూ.8–10 ఖర్చు చేయాల్సి వస్తుంది’ అని సిన్హా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment