Aviation Minister
-
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు... స్పందించిన సింధియా
న్యూఢిల్లీ: స్పెస్ జెట్ బోర్డింగ్ పాస్ కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. దీంతో సింధియా ఫిర్యాదులను పరీశీలించేందుకు అంగికరీంచడమే కాకుండా త్వరితగతిన విచారణ చేస్తానని ట్వీట్ చేశారు. కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా అలా చేయడంలో విఫలమైన ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఫిర్యాదులు చేశారు. అంతేగాదు ఎయిర్పోర్ట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నించే వారి నుంచి కొన్ని ఎయిర్‌లైన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్లో చెక్ ఇన్ చేయడానికి ఒక్కో టికెట్‌కు రూ. 200 ఖర్చవుతుందని స్పైస్‌జెట్‌తో పాటు ఇండిగో కూడా అదే పని చేసిందని వెల్లడించారు. దీని వల్ల వినియోగ దారులకు చాలా అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు. Agreed, will examine this asap! https://t.co/KkY8b0xP93 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 13, 2022 Ridiculous .Is @JM_Scindia listening? https://t.co/HBL8hUo4oT — Madhavan Narayanan (@madversity) May 13, 2022 new rule of SpiceJet. If you wish to get a boarding card at the check in counter,you need to pay extra. This is like telling a customer In a restaurant that if you want eat in a plate, you will be charged. Wonder what’s conssumer forum doing!@flyspicejet @BDUTT @madversity — Dr. Neeti Shikha (@neetishikha) May 13, 2022 (చదవండి: ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం) -
రూ.2,537 కోట్ల బకాయిలు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణ పురపాలక శాఖకు రావాల్సిన రూ.2,537 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో కలసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర పురపాలక శాఖకు సంబంధించి పలు విషయాలను కేంద్ర మంత్రితో చర్చించాం. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి, కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చిన తీరును వివరించాం. అక్టోబర్‌లో మొత్తం నివేదికతో రావాలని మంత్రి తమకు సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.217 కోట్లు, అమృత్ స్కీమ్ కింద రూ.351.77 కోట్లు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు రూ.783 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. తెలంగాణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పట్టణ ప్రాంత డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి రూ.1,184 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మున్సిపల్ శాఖకు రూ.2,537.81 కోట్ల నిధులు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని కోరాం. వీటిపై సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి తగిన ఆదేశాలు ఇచ్చారు’అని కేటీఆర్ వెల్లడించారు. మామునూరుకు కేంద్ర బృందం.. సాధ్యమైనంత త్వరగా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరామని కేటీఆర్ వెల్లడించారు. ఉడాన్ స్కీమ్‌లో వరంగల్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశామని, తప్పకుండా చేరుస్తామని, పది రోజుల్లో కేంద్ర బృందాన్ని పంపుతామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ‘తెలంగాణలో మొత్తం ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సర్వే జరపనుంది. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించి గతంలో మార్చి 3న ఒక సమావేశం జరిగింది. కరోనా రావడంతో ఏఏఐ చేయాల్సిన సర్వే, ఉడాన్‌లో చేర్చాల్సిన అంశం పెండింగ్‌లో పడిపోయింది. ఆ పనులను వేగవంతం చేయాలని కోరాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయండి..: వినోద్ కుమార్ కరీంనగర్లో స్మార్ట్ సిటీ మిషన్ అమలుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలోని 9 ప్రాజెక్టులకు సంబంధించి రూ.330 కోట్ల పనులు అమల్లో ఉన్నాయని, రూ.206 కోట్ల విలువైన 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ మొదటి దశ కోసం రూ.196 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, అందులో రూ.78 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మిగిలిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. -
‘అంతర్జాతీయ విమాన సేవలు అప్పుడే’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నియంత్రణలను ఎత్తివేసే దిశగా వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పూరీ మంగళవారం పేర్కొన్నారు. ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్ సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ విమాన సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని నిర్ధిష్టంగా తాను వెల్లడించలేనని చెప్పారు. కాగా ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాల సంఖ్యపై పరిమితులతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. -
ప్రయాణికుడికి ఒక బ్యాగ్ మాత్రమే అనుమతి
-
పౌర విమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : అశోక గజపతిరాజు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పౌరవిమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు నియమితులయ్యారు. 2014 నుంచి 17 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేనను వదిలి 2014లో సురేశ్ ప్రభు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వాణిజ్య శాఖామంత్రిగా పని చేస్తున్న ఆయనకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. -
‘ఆటో కంటే విమానయానమే చౌక’
ఇండోర్: దేశంలో ఆటోల కంటే విమానాల్లో ప్రయాణమే చౌకగా మారిందని కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇండోర్ మేనేజ్మెంట్ అసోసియేషన్ శనివారం నాడిక్కడ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో సిన్హా మాట్లాడారు. ‘ప్రస్తుతం భారత్‌లో విమానాల్లో ప్రయాణం ఆటో రిక్షాల కంటే చౌకగా మారింది. కొందరు వ్యక్తులు నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నానని అనుకుంటారు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఈ రోజుల్లో ఇండోర్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లాలంటే కిలోమీటర్‌కు రూ.5 వరకూ అవుతోంది. అదే ఆటోలో వెళ్లాలంటే కి.మీకు రూ.8–10 ఖర్చు చేయాల్సి వస్తుంది’ అని సిన్హా తెలిపారు. -
'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గణపతిరాజు చెప్పారు. ఎయిరిండియా ఎప్పటికీ దేశానికి సేవ చేసేలా ఉండేలా చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎయిరిండియాలో పనిచేసే ఎవరూ కూడా ఉద్యోగం కోల్పోవడానికి వీలులేదని అశోక్ గణపతిరాజు లోక్‌సభలో చెప్పారు. ఈ నేషనల్ క్యారియల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.'' ఎయిరిండియాలో పనిచేసే ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా మారాలని కోరుకోవడం లేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియా కావాలనుకోవడం లేదు. ఎయిరిండియా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అతి పైపై ఎత్తులకు ఇంకా ఎగరాలి'' అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని, ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ ప్యానల్‌కు ఎంపీలతో సహా సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. జూన్ 28న ఎయిరిండియాలోని పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ తుది పద్ధతులను ఆర్థికమంత్రి నేతృత్వంలోని మంత్రులే నిర్ణయిస్తారని అశోక్ గణపతి రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిరిండియా రుణభారం రూ.52వేల కోట్లకు చేరుకుంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. -
గైక్వాడ్‌కు మళ్లీ విమానయోగం
నిషేధం ఎత్తివేసిన ఎయిర్ ఇండియా ► పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నిర్ణయం న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రైవేటు విమానయాన సంస్థలు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకొంటాయని భావిస్తున్నామన్నారు. ఘటనపై గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. గత నెల 23న ఎయిర్ ఇండియా సీనియర్ అధికారిని గైక్వాడ్ చెప్పుతో 25సార్లు కొట్టారు. దీనికి నిరసనగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు విమానంలో ఆయన ప్రయాణించడాన్ని గతంలో నిషేధించాయి. బేషరతు క్షమాపణ చెబితేనే... మరోవైపు... విమాన అధికారిపై చేయిచేసుకున్న ఎంపీ గైక్వాడ్ బేషరుతుగా క్షమాపణ చెప్పే వరకూ ఆయన్ని విమానంలో ప్రయాణించబోనివ్వమని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనికి సంఘం లేఖ రాసింది. క్షమాపణ చెప్పకుండా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేస్తే అది సంస్థ ఉద్యోగులతో పాటు భారతీయుల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని సంఘం లేఖలో పేర్కొంది. దీంతోపాటు ఏఐకి చెందిన ‘ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ గైక్వాడ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ఆయన్ను విమానాల్లో తిరగనివ్వమని హెచ్చరించింది. ఉపసంహరించుకోండి... గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రిత్వ శాఖ ప్రైవేటు విమాన సంస్థలను కోరింది. అయితే దీనిపై ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్’ (ఎఫ్ఐఏ) అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఎఫ్ఐఏ నుంచి ఎలాంటి సమాచారం అందనంతవరకూ ఎంపీపై నిషేధం కొనసాగుతుందని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి చెప్పారు. ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ గైక్వాడ్ శుక్రవారం రైలులో ముంబైకి పయనమయ్యారు. నిషేధానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గైక్వాడ్‌కు చేరకపోవటంతో రైల్లో వెళ్తున్నారని ఎంపీ సన్నిహితులు తెలిపారు. -
ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తేసిన ఎయిరిండియా
-
పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసి.. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఎయిరిండియా సిబ్బందిపై అనుచితంగా దాడి చేసిన ఘటనలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గురువారం కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాశారు. దీంతో పాటు పార్లమెంట్ లో దాడి ఘటనపై కూడా తన లేఖలో ప్రస్తావించారు. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి వ్యవహారంపై ఆయన ఇవాళ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. తాను ఎయిరిండియాకు కాదని, పార్లమెంట్‌కు క్షమాపణ చెబుతానని అన్నారు. మరోవైపు ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు లోక్‌సభలో హల్చల్ చేసి విమానాయాన మంత్రి అశోక్ గజపతిరాజును ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. కాగా గత నెల పుణె నుంచి ఢిల్లీ ప్రయాణించిన సందర్భంలో 60 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఆయన పలుసార్లు టికెట్ బుక్ చేసుకున్నా.. వాటిని రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దాడిపై పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ రాయడంతో దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చని సమాచారం. మరోవైపు ఏప్రిల్ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది. -
మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ
విజయనగరం: మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల రామకృష్ణపై టీడీపీ కౌన్సెలర్లు కొద్ది కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరికి రామకృష్ణపై ఈ రోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న అశోక్ గజపతి రాజు చైర్ పర్సన్ ను మార్చే పనిలో పడ్డారు. అయితే తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని రామకృష్ణ తన వర్గం కౌన్సెలర్లతో అన్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజీనామా విషయంపై రామకృష్ణ సమాలోచనలు చేస్తున్నారు.