![మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61416057624_625x300_0.jpg.webp?itok=ZFGbIgjy)
మున్సిపల్ చైర్మన్ ను మార్చే యోచనలో టీడీపీ
విజయనగరం: మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసాదుల రామకృష్ణపై టీడీపీ కౌన్సెలర్లు కొద్ది కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరికి రామకృష్ణపై ఈ రోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న అశోక్ గజపతి రాజు చైర్ పర్సన్ ను మార్చే పనిలో పడ్డారు. అయితే తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని రామకృష్ణ తన వర్గం కౌన్సెలర్లతో అన్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజీనామా విషయంపై రామకృష్ణ సమాలోచనలు చేస్తున్నారు.