జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్ మరో రెండు రోజులు పొడిగింపు | Jet Airways Extends Special Economy Fare Offer | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్ మరో రెండు రోజులు పొడిగింపు

Published Wed, Aug 6 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్ మరో రెండు రోజులు పొడిగింపు

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్ మరో రెండు రోజులు పొడిగింపు

 ముంబై: జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఎకానమి క్లాస్‌కు సంబంధించి స్పెషల్ ఆఫర్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. దేశీయ రూట్లలో  ఈ ఆఫర్‌ను గత నెల 31న కంపెనీ ప్రకటించింది. రూ.1,499 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్‌కు టికెట్లను నేడు, రేపు (ఆగస్టు 6,7 తేదీల్లో) బుక్ చేసుకోవచ్చని, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. బేస్ చార్జీ, ఇంధన సర్‌చార్జీల్లో 40 శాతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. తమ దేశీయ నెట్‌వర్క్‌లో డెరైక్ట్, కనెక్ట్ ఫ్లైట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది వర్తించదని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది.

 ఎమిరేట్స్ స్పెషల్ ఆఫర్లు
 గల్ఫ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ సంస్ధ 67వ భారత స్వాతంత్య్ర దినోత్సవం  సందర్బంగా భారత విమాన ప్రయాణికులకు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. పశ్చిమాసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికాలకు ఎకానమీ క్లాస్‌కైతే రూ.21,858, బిజినెస్ క్లాస్‌కు అయితే రూ.52,312 నుండి ఈ స్పెషల్ చార్జీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ స్పెషల్ ఆఫర్లకు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 10న ముగుస్తాయని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి డిసెంబర్ 10 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement