రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్‌ | Central Economic Intelligence Bureau launches Automated Search Portal for public sector banks | Sakshi
Sakshi News home page

రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్‌

Published Sat, Feb 24 2024 6:27 AM | Last Updated on Sat, Feb 24 2024 6:27 AM

Central Economic Intelligence Bureau launches Automated Search Portal for public sector banks - Sakshi

న్యూఢిల్లీ: రుణాలు కోరుకునే వారికి సంబంధించి పూర్వపు ధ్రువీకరణ వివరాలతో ఒక పోర్టల్‌ను సెంట్రల్‌ ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (సీఈఐబీ) ప్రారంభించింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంక్‌లు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కావాల్సిన సమాచారాన్ని ఇది అందిస్తుందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

అతిపెద్ద బ్యాంక్‌ మోసాలకు సంబంధించి 2015 మే 13, 2019 నవంబర్‌ 6న ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల మేరకు.. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) రూ.50 కోట్లకు మించిన రుణాన్ని కొత్తగా మంజూరు చేసే ముందు, లేదా అప్పటికే ఎన్‌పీఏగా మారిన రుణ గ్రహీత విషయంలో సీఈఐబీ నుంచి నివేదిక కోరాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ సహకారంతో సీఈఐబీ రూపొందించిన పోర్టల్‌ ఇప్పుడు బ్యాంక్‌ల పని సులభతరం చేయనుంది. పెద్ద రుణాలకు సంబంధించి సీఈఐబీ అనుమతిని ఈ పోర్టల్‌ ద్వారా బ్యాంక్‌లు పొందే అవకాశం ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement