
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐసీటీఈ జాబ్ పోర్టల్
ఎడ్యు న్యూస్
దేశంలో ఇంజనీరింగ్ డిగ్రీలు పొందిన విద్యార్థుల కెరీర్ కోణంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రత్యేకంగా ఒక జాబ్ పోర్టల్‌కు శ్రీకారం చుట్టనుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న విద్యార్థులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా సంస్థలు కూడా తమకు అవసరమైన ఉద్యోగాల సమాచారాన్ని పొందుపర్చుకోవచ్చు.
ఈ రెండు వర్గాలను ఉమ్మడి ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చే విధంగా రూపొందిస్తున్న ఈ వెబ్‌సైట్ ద్వారా అటు కంపెనీలు, ఇటు విద్యార్థులు తమకు కచ్చితంగా సరితూగే ఉద్యోగాలు పొందే అవకాశాలు మెరుగవనున్నాయి. ఏఐసీటీఈ వర్గాలు పేర్కొన్న సమాచారం ప్రకారం ఒక విద్యార్థి ఒకసారి లాగిన్ అవడం ద్వారా గరిష్టంగా అయిదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మరికొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చనుంది.