
ఈ ఏడాది కొత్త వెంచర్ ఆవిష్కరణ
ముంబై: వ్యాపార దిగ్గజం కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా (30) తాజాగా సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్ విభాగంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది కొత్త వెంచర్ ద్వారా పలు బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వినియోగదారులు, దేశీ బ్రాండ్ల నుంచి మరింతగా ఆశిస్తున్నట్లు అనన్య ఒక ప్రకటనలో తెలిపారు.
వారి ఆకాంక్షలను తీర్చే విధంగా తమ ఉత్పత్తుల శ్రేణి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, వెంచర్ పేరు, పెట్టుబడి ప్రణాళికలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఏటా 10–11 శాతం వృద్ధి చెందుతున్న పర్సనల్ కేర్ మార్కెట్ 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 17 ఏళ్ల వయస్సులోనే అనన్య బిర్లా సూక్ష్మ రుణాల సంస్థ స్వతంత్ర మైక్రోఫిన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశీయంగా రెండో అతి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐగా కార్యకలాపాలు సాగిస్తోంది. గాయని, పాటల రచయిత కూడా అయిన అనన్య.. 62 బిలియన్ డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్ బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment