ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్‌ | Aditya Birla Financial diversifies into health insurance with ABHICL | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 23 2016 8:05 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ఆర్థిక సేవల రంగంలో పేరొందిన ఆదిత్యా బిర్లా గ్రూప్‌.. తొలిసారిగా ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీహెచ్‌ఐసీఎల్‌) బ్రాండ్‌ పేరిట మార్కెట్లోకి ప్రవేశించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్‌తో కలసి 51:49 జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్యబీమా రంగంలోకి ప్రవేశించినట్లు ఏబీహెచ్‌ఐసీఎల్‌ సీఈఓ మయాంక్‌ భత్వాల్‌ గురువారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రూపుల్లో 4 రకాల పాలసీలు, ఒక రిటైల్‌ పాలసీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 150 నగరాల్లోని 1,500 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement