
ముంబై : భారత్ తొలిసారి అతిపెద్ద ‘క్రిప్టోజాకింగ్’ ఎటాక్ బారిన పడింది. దేశీయ అతిపెద్ద బహుళ జాతీయ దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్‌ను టార్గెట్‌గా చేసుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలకు చెందిన 2000కు పైగా కంప్యూటర్లపై హ్యాకర్లు ఈ దాడికి దిగినట్టు తెలిసింది. కొత్త రకం సైబర్ మాల్‌వేర్‌ను వీరు గ్రూప్ కంపెనీల కంప్యూటర్లలోకి చొప్పించినట్టు వెల్లడైంది. ఈ కొత్త రకం మాల్‌వేర్ ద్వారా హ్యాకర్లు క్రిప్టో కరెన్సీను పొందడానికి టార్గెట్ టర్మినల్స్‌ను, వారి ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని దుర్వినియోగపరుస్తారు.
గత నెలలోనే ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ సబ్సిడరీల్లో ఈ ఎటాక్‌ను గుర్తించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొన్ని రోజుల్లోనే ఈ మాల్‌వేర్ తమ బిజినెస్ హౌజ్‌కు చెందిన తయారీ, ఇతర సర్వీసుల కంపెనీలను ఎటాక్ చేసినట్టు పేర్కొన్నాయి. అయితే హ్యాకర్లు ఉద్దేశ్యం సమాచారాన్ని దొంగలించడం కాదని, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమేనని తెలిపాయి. టార్గెట్ కంప్యూటర్లను హైజాక్ చేయకుండా.. క్రిప్టో కాయిన్లు కలిగిన ఆర్గనైజేషన్ పవర్ సప్లయ్‌కు అంతరాయం సృష్టించిన్నట్టు వెల్లడించాయి.
ఈ ఎటాక్‌పై ఆదిత్య బిర్లా గ్రూప్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... థ్రెట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థల్లో తమ గ్రూప్ చాలా అడ్వాన్స్‌గా ఉంటుందని, ఎప్పడికప్పుడూ పరిశీలిస్తూ.. వ్యాపార కీలక అప్లికేషన్లను కాపాడుతూ ఉంటామని తెలిపారు. కానీ ఇటీవల తమ గ్రూప్ థ్రెట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలకు చెందిన కొన్ని డెస్క్‌టాప్ సిస్టమ్స్‌లో అనుమానిత కార్యకలాపాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇలా గుర్తించిన వెంటనే తమ అంతర్గత టీమ్‌తో విచారణ జరిపించామని, సిస్టమ్స్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆ అనుమానిత కార్యకలాపాన్ని తొలగించినట్టు చెప్పారు. దీని వల్ల ఎలాంటి డేటాను కోల్పోలేదని తేల్చారు. దీనిపై ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్టు అధికార ప్రతినిధి తెలిపారు.
క్రిప్టోజాకింగ్...
- ఇది ఓ కొత్త రకం మాల్‌వేర్
- ఇది కంప్యూటర్లను జోంబీస్‌లోకి మారుస్తోంది.
- హ్యాకర్ల ప్రధాన ఉద్దేశ్యం సమాచారాన్ని దొంగలించడం కాదు, క్రిప్టోకరెన్సీలను పొందడం
- ఈ డిజిటల్ సొమ్మును సేకరించే లక్ష్యంతో కంప్యూటర్లు, క్లౌడ్ సీపీయూల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేస్తారు
- ఫలితంగా మన కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది
Comments
Please login to add a commentAdd a comment