ఆదిత్య బిర్లా గ్రూప్ కు ఆర్బీఐ లైసెన్సు ఇచ్చేసింది!
Published Tue, Apr 4 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
న్యూఢిల్లీ : పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ కు రిజర్వు బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఆదిత్య బిర్లా గ్రూప్ మంగళవారం ఆర్బీఐ నుంచి లైసెన్సు పొందింది. కుమార్ మంగళం బిర్లా అధినేతగా గ్రూప్ అవుట్ ఫిట్ ఆదిత్య బిర్లా నువో 51:49 జాయింట్ వెంచర్ తో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ ను ఏర్పాటుచేసింది. టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ తో కలిసి ఈ పేమెంట్స్ బ్యాంకు సర్వీసులను ప్రారంభించనుంది.
దీనికి సంబంధించిన ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ కు ఆర్బీఐ నుంచి లైసెన్సు అందినట్టు ఆదిత్య బిర్లా నువో మంగళవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్ టెల్, ఇండియా పోస్టులు మాత్రమే పేమెంట్ బ్యాంకు సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. 2017 ప్రథమార్థంలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకును ఆవిష్కరించనున్నట్టు ఐడియా సెల్యులార్ చీఫ్ కోపరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజత్ ముఖర్జీ అంతకముందే తెలిపారు. పేమెంట్స్ బ్యాంకులు ఒక్కో అకౌంట్ పై గరిష్టంగా లక్ష రూపాయల వరకు డిపాజిట్లను స్వీకరించనున్నాయి.
Advertisement
Advertisement