
వొడాఫోన్, ఐడియా విలీనానికి సీసీఐ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇరు సంస్థలకు సీసీఐ అప్రూవల్ లేఖలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా, వొడాఫోన్ ఇండియా మార్చి 20న విలీన ప్రతిపాదనను ప్రకటించడం తెలిసిందే. 40 కోట్ల మంది కస్టమర్లు, 35% మార్కెట్ వాటా, ఆదాయాల మార్కెట్లో 41% వాటాతో విలీన కంపెనీ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఆవిర్భవించగలదని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. విలీనంతో రూ. 80,000 కోట్ల ఆదాయం గల కంపెనీ ఆవిర్భవించనుంది. విలీన సంస్థలో వొడాఫోన్‌కు 45.1%, ఐడి యా ప్రమోటర్లకు 26% వాటాలు ఉండనున్నాయి.