ICICI Bank Vishakha Mulye Appointed as CEO of Aditya Birla Capital - Sakshi
Sakshi News home page

Vishakha Mulye: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ సీఈవోగా విశాఖ మూల్యే!

Published Mon, Apr 25 2022 11:24 AM | Last Updated on Mon, Apr 25 2022 12:53 PM

Vishakha Mulye to join Aditya Birla Capital as CEO - Sakshi

ముంబై: ఆర్థిక సేవల సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ సీఈవోగా విశాఖ మూల్యే నియమితులయ్యారు. జూన్‌ 1 నుంచి ఆమె బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆమె ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఉన్నారు.

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో అజయ్‌ శ్రీనివాసన్‌ స్థానంలో విశాఖ నియమితులయ్యారు. ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ బోర్డులో చేరనున్న తొలి మహిళా సభ్యురాలిగా కూడా ఆమేనని కంపెనీ తెలిపింది.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన విశాఖ మూలేకి దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరియర్‌ ఉంది. 2002లో ఐసీఐసీఐ బ్యాంక్‌–ఐసీఐసీఐ విలీనాన్ని పర్యవేక్షించిన టీమ్‌లో ఆమె సభ్యురాలు. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ వెంచర్‌లో కూడా కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement