7 కోట్ల మీటర్లు.. 288 డిజైన్లు.. | Telangana:Bathukamma Sarees Making In Sircilla | Sakshi
Sakshi News home page

7 కోట్ల మీటర్లు.. 288 డిజైన్లు..

Published Sat, Jul 17 2021 3:32 AM | Last Updated on Sat, Jul 17 2021 3:32 AM

Telangana:Bathukamma Sarees Making In Sircilla - Sakshi

సిరిసిల్ల గోదాములో బతుకమ్మ చీరల బట్ట సేకరణ

సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డు ఉన్న మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలు అందిస్తోంది. సిరిసిల్లలోని నేతన్నలకు ఉపాధి కలి్పంచాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో ఉన్న వస్త్రపరిశ్రమను ఆదుకోవడంతోపాటు నేతన్నలకు ప్రభుత్వపరంగా ఉపాధి కలి్పస్తున్నారు. ఈసారి పవర్‌లూమ్స్‌ (మరమగ్గాల)పై డాబీ డిజైన్స్‌ చీరలను ఉత్పత్తి చేయాలని జౌళి శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పవర్‌లూమ్స్‌కు అదనంగా జకార్డ్, డాబీ పరికరాలను అమర్చి చీరలపై రకరకాల డిజైన్లు వచ్చేలా చేస్తున్నారు.

దీంతో చీరల కొంగులు, అంచులపై నెమలి పించం, ఆకులు, కమలం వంటి కంటికి ఇంపైన డిజైన్లతో కూడిన చీరలను సిరిసిల్ల నేతన్నలు నేస్తున్నారు. ఈ ప్రయోగంతో నేతకారి్మకులకు పని ఒత్తిడి, యజమానులకు ఆర్థిక భారం పడింది. అయినా.. నవ్యతను, నాణ్యతను పెంచేక్రమంలో జౌళి శాఖ డాబీ డిజైన్లకు మొగ్గుచూపింది. దీంతో 288 రకాల డిజైన్లలో వందకుపైగా రంగుల్లో ఈ ఏడాది బతుకమ్మ చీరలు సిద్ధమవుతున్నాయి.

లక్ష్యం దిశగా అడుగులు: సిరిసిల్లలో వ్రస్తోత్పత్తిదారులకు ఈ ఏడాది జనవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. నూలు కొనుగోలు, జకార్డ్, డాబీల దిగుమతి, పవర్‌లూమ్స్‌కు బిగింపు వంటి పనులతో చీరల ఉత్పత్తి ఆలస్యంగా మొదలైంది. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌తో కారి్మకులు వెళ్లిపోవడం, నూలు, పవర్‌లూమ్స్‌ విడిభాగాల దిగుమతిలో కూడా జాప్యమైంది. సిరిసిల్లలోని 136 మ్యాక్స్‌ సం ఘాలకు, మరో 138 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు, టెక్స్‌టైల్‌ పార్క్‌లోని 76 యూనిట్లకు బతుక మ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు.

తొలుత జాప్యం జరగడంతో ప్రస్తుతం సిరిసిల్లలో రేయింబవళ్లు వేగంగా వస్త్రోత్పత్తి సాగుతోంది. ఉత్పత్తి అయిన చీరల వ్రస్తాన్ని టెస్కో అధికారులు వెంట వెంటనే సేకరిస్తూ.. ప్రాసెసింగ్‌కు పంపిస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మీటర్ల వ్రస్తాన్ని ప్రాసెసింగ్‌ కోసం తరలించారు. ఇదిలా ఉండ గా తొలిసారి ఆర్టీసీ కార్గో సేవలను బతుకమ్మ చీరల రవాణాకు వినియోగించుకుంటున్నారు.

గత ఏడాది సాంచాలపై మిగిలిపోయిన వస్త్రాన్ని సైతం అధికారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరల వ్రస్తాన్ని సకాలంలో అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

మంచి డిజైన్లలో చీరలు ఉన్నాయి.. 
సిరిసిల్లలో బతుకమ్మ చీరలు మంచి డిజైన్లలో ఉత్పత్తి అవుతున్నాయి. మొదట్లో వస్త్రోత్పత్తిదారులు కొంత ఇ బ్బంది పడినా.. నాణ్యమైన చీరల ఉత్పత్తి దిశగా సాగుతున్నారు. గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం. ఇప్పటికే చీరల బట్టను ప్రాసెసింగ్‌కు పంపించాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement