సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం | fire accident in textial park | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం

Published Sun, Aug 28 2016 8:43 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం - Sakshi

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం

  • రూ. 10లక్షల ఆస్తినష్టం
  • సిరిసిల్ల రూరల్‌ : సిరిసిల్ల మండలం బద్దెనపల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తుల్జాభవాని కార్ఖానాలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రూ.8లక్షల విలువైన యంత్రాలు, రూ.2లక్షల విలువైన వేస్టేజ్‌ కాటన్‌ కాలిబుడిదయ్యాయి. యజమాని నాగారం వెంకటేశం అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం చేరవేశారు. అప్పటికే యంత్రాలు, కాటన్‌వేస్టేజ్‌ కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఏఎస్సై చీనా నాయక్‌ విచారణ జరుపుతున్నారు.
    కానరాని ఫైర్‌సేఫ్టీ..?
    టెక్స్‌టైల్‌ పార్క్‌లో రూ.కోట్లు వెచ్చించి పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, ఫైసెఫ్టీ నిబంధనలు  పాటించడం లేదని, అందుకే ప్రమాదాలు సంభవించకా నష్టాలు అధికంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆస్తినష్టం సంభవించాక లబోదిబోమనడం మినహా యజమానులు చేసేదేమీ ఉండడంలేదు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement