సూరత్ టెక్స్‌టైల్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం
సూరత్: సూరత్ సహారా దర్వాజా ప్రాంతంలోని విపుల్ బిల్డింగ్‌లో టెక్స్‌టైల్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
భారీగా మంటలు ఎగిసిపడుతున్న కారణంగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం 17వ అంతస్థు టెక్స్‌టైల్స్ షోరూంలో సంభవించింది.