
న్యూఢిల్లీ: వస్త్రాల తయారీ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 79 శాతం ఎగసి రూ.125 కోట్లు సాధించింది. టర్నోవర్ 2.93 శాతం అధికమై రూ.2,170 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 3.5 శాతం హెచ్చి రూ.2,072 కోట్లుగా ఉంది.
వస్త్రాల ద్వారా ఆదాయం 1.88 శాతం పెరిగి రూ.1,759 కోట్లకు, అడ్వాన్స్ మెటీరియల్స్ 5 శాతం అధికమై రూ.313 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే అరవింద్ లిమిటెడ్ షేరు ధర బీఎస్‌ఈలో మంగళవారం 1.88 శాతం తగ్గి రూ.94 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment