నేత కార్మికుల సమ్మె..
సాక్షి, సిరిసిల్ల: మరమగ్గాలకు కేంద్రమైన సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ స్తంభించింది. కూలీ పెంచాలనే డిమాం డ్‌తో దాదాపు 8 వేల మంది నేత కార్మికులు సోమవారం సమ్మెకు దిగడంతో మరమగ్గాలు నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ప్రతీ కార్మికుడికి నెలకు కనీసం రూ.15 వేలు కూలీ గిట్టుబాటు అయ్యేట్లు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నేతకార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
స్వయంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ చెప్పినా వినని యజమానులకు రాయితీలు రద్దు చేయాలని, ప్రభుత్వ ఆర్డర్లు నిలిపివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. వస్త్రపరిశ్రమ స్తంభించడంతో జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పవర్‌లూం యజమానులు, కార్మికులతో చర్చలు జరిపారు. కూలీ పెంచా లని యజమానులకు సూచించారు. పాతఒప్పం దాలను అమలు చేస్తామని యజమానులు ఇచ్చిన హామీతో టెక్స్‌టైల్ పార్కు కార్మికులు ఒక రోజు సమ్మె చేశాక సమ్మె విరమిస్తునట్లు ప్రకటించారు.
సిరిసిల్లలో స్తంభించిన వస్త్రపరిశ్రమ
Published Tue, May 9 2017 3:16 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement