- అంచనా వ్యయం రూ.3000 కోట్లు
- 3500 ఎకరాల్లో నిర్మాణం
- ఎమ్మెల్యే టి.రాజయ్య
7న టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
Published Mon, Jul 25 2016 11:34 PM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM
స్టేషన్ ఘన్‌పూర్ టౌన్ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలంలో టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణానికి ఆగస్టు 7న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. సోమవారం స్టేషన్ ఘన్‌పూర్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మసాగర్ మండలంలో 3,500 ఎకరాల్లో రూ.3వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేస్తారన్నారు.
ఉప్పుగల్లులో రూ. 320 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఈనెల 27న మంత్రి చందూలాల్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే రోజున స్టేషన్ ఘన్‌పూర్ గిరిజన బాలికల వసతి గృహంలో జరిగే హరితహారం, అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులు పూర్తయితే నియోజకవర్గం ఆరు రిజర్వాయర్లతో సస్యశ్యామలం అవుతుందన్నారు.
Advertisement
Advertisement