Reservoir works
-
వడివడిగా మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు
-
ప్రాజెక్టు పనులకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో సాగునీటి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ పరిధిలోని ప్రాజెక్టులలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పనులను పూర్తి చేసి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 1.65 టీఎంసీల సామర్థ్యం కలిగిన వామికొండ సాగర్, 3.06 టీఎంసీల సామర్థ్యం కలిగిన సర్వరాయసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ పనులతోపాటు కట్ట రివిట్మెంట్, లీకేజీ అరికట్టే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సూచనలతో ఇప్పటికే సదరు పనులను పూర్తి చేసేందుకు అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. రూ. 212 కోట్లతో ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనుల కోసం టెండరు ప్రక్రియ సాగుతోంది. నేడో, రేపో ఈ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలువనుంది. టెండరు ప్రాసెస్ అయిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నారు. జూన్ నాటికి 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అత్యంత వేగంగా పనులు చేపట్టి వచ్చే జూన్ నాటికి దాదాపుగా పనులు పూర్తి చేసి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత రెండు ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయనున్నారు. దీంతోపాటు రెండు రిజర్వాయర్ల బండ్ (కట్ట)లో పెండింగ్‌లో ఉన్న రివిట్మెంట్ పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వామికొండ పరిధిలోని ఒంటిగారిపల్లె, సర్వరాయసాగర్ పరిధిలో కట్ట లీకేజీలను అరికట్టే పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్ల కట్ట పరిధిలో నీరు లీక్ అవుతుండడంతో ఒంటిగారిపల్లె, ఇందుకూరు గ్రామాల పొలాల్లో నిత్యం నీరు నిల్వ ఉంటోంది. దీంతో ఆ భూముల్లో పంటలు వేసేందుకు వీలు లేకుండా పోయింది. నీటి లీకేజీని అరికడితే తప్ప ఆ ప్రాంతంలోని పొలాల్లో పంటల సాగుకు అవకాశం లేదు. తక్షణమే కట్ట లీకేజీ అరికట్టే పనులను రూ. 12 కోట్లతో చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వేగంగా భూ సేకరణ డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టేందుకు వీలుగా 795 ఎకరాలను ప్రభుత్వం భూ సేకరణ కింద సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 60 శాతం భూ సేకరణ పూర్తి కాగా, మిగిలిన 40 శాతం భూ సేకరణ చివరి దశలో ఉంది. టెండర్లు పూర్తయ్యే నాటికి భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సాగులోకి 35 వేల ఎకరాల ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయితే వామికొండ పరిధిలో ముద్దనూరు, వీఎన్ పల్లె ప్రాంతాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టుకు అలాగే సర్వరాయసాగర్ పరిధిలో కమలాపురం నియోజకవర్గంలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రెండు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అన్ని పనులను పూర్తి చేసి పై రెండు ప్రాజెక్టుల పరిధిలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే జూన్ నాటికి వీలైనంత వరకు పనులను పూర్తి చేసి 15–20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. భూ సేకరణ పనులు దాదాపు పూర్తి వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో ఉన్న అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు రూ. 212 కోట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండరు ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనుల కోసం 795 ఎకరాల భూమి అవసరం ఉండగా, 60 శాతం భూ సేకరణకు సంబం«ధించి అవార్డు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 40 శాతం సేకరణకు సంబంధించి అవార్డు దశలో ఉంది. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. పనులు పూర్తయితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. – వి.విజయరామరాజు, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా వామికొండ సర్వరాయసాగర్ పరిధిలో త్వరలో పెండింగ్ పనులు పూర్తి వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటరీ, రివిట్మెంట్, కట్ట లీకేజీ అరికట్టే పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ. 212 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. వెంటనే పనులు మొదలు పెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. – మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప -
సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
-
‘రివర్స్’తో మొత్తం రూ.1,532.59కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,532.59 కోట్లు ఆదా అయ్యాయి. అత్యధికంగా పోలవరం హెడ్‌వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్ వల్ల రూ.782.80 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్తూరుపాడు రిజర్వాయర్ పనుల్లో 67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలాయి. -
‘కేశవాపూర్’ పనులు వడివడిగా..
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా కేశవాపూర్ మంచినీటి పథకం పనుల శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో అటవీ భూములు, పట్టా భూములు, అసైన్డ్ భూములు కలిగి ఉన్నాయని సంబంధిత అధికారులతో కలెక్టర్ ఎంవీరెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ పాయింట్ ఎక్కడ వస్తుందని సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ గట్టు ఎక్కడ వరకు ఉందని అడిగారు. రిజర్వాయర్ భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు తమకు రావలసిన నష్టరరిహారం త్వరగా ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ ఎంవీరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు త్వరలో ఇప్పిస్తామని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, కీసర ఆర్డీఓ లచ్చిరెడ్డి, తహశీల్దార్ నాగరాజు, శామీర్‌పేట్ తహశీల్దార్ గోవర్దన్, కీసర ఎంపీడీఓ శశిరేఖ, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. రిజర్వాయర్ ప్రత్యేకతలివే... శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 623 అడుగుల ఎత్తులో కొండ పోచమ్మ సాగర్‌ను 17 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం జలాలతో నింపనున్నారు. సీజన్లో రెండు అడుగుల మేర గోదావరి జలాలు ఈ జలాశయంలో చేర్చినప్పటికీ, అక్కడికి 16 కిలో మీటర్ల దూరంలోని కేశవాపూర్ రిజర్వాయర్‌కు (585 అడుగుల ఎత్తు) పైసా ఖర్చు లేకుండా గ్రావిటీ ఆధారంగానే సరఫరా చేసేందుకు వీలుగా 3,600 ఎంఎం డయా వ్యాసార్ధం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్లైన్లనూ రెండు వరుసల్లో ఏర్పాటు చేయనున్నారు. అక్కడికి సమీపంలో బొమ్మరాసుపేట్ నీటి శుద్ధి కేంద్రంలో 172 మిలియన్‌గ్యాలన్ల(10 టీఎంసీలు) రా వాటర్‌ను శుద్ధిచేసి శామీర్‌పేట్ ,సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా, రిజర్వాయర్ నిర్మాణంతో హైదరాబాద్ మహానగర జనాభా 2030 నాటికి రెండు కోట్లకు చేరుకున్నప్పటికీ తాగు నీటికి ఢోకా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 2300 ఎకరాల భూమి అవసరం కాగా, రూ.4,396 కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారవర్గాల అంచనా. -
ప్రాజెక్టుపై కోటి ఆశలు
ఇచ్చోడ(బోథ్): జిల్లాలోని భీంపూర్ మండలం పిప్పల్‌కోటి వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ నిర్మాణ టెండర్ పూర్తయింది. 1.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న రిజర్వాయర్‌కు అవసరమైన బండ్( కట్ట)కోసం అధికారులు రెండువందల ఎకరాల భూమిని ఇప్పటికే సమీకరించారు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ పిప్పల్‌కోటి వద్ద రూ.368 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి రిజర్వాయర్‌పై ఇక్కడిప్రాంత రైతులు ఆశలు పెట్టుకున్నారు. చెప్పిన వెంటనే సీఎం కేసీఆర్ పిప్పల్‌కోటి రిజర్వాయర్‌కోసం కేబినెట్లో ఆమోద ముద్రవేశారు. దీంతో రిజర్వా యర్ నిర్మాణంపై పూర్తిగా స్పష్టత వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు రిజర్వాయర్ నిర్మాణంకోసం కసరత్తు ప్రారంభించారు. రిజర్వాయర్ జిల్లాకే తలమానికంకానుంది. పూర్తయిన భూసేకరణ బండ్(కట్ట) నిర్మాణంకోసం రెండు వందల ఎకరాల భూసేకరణను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. పనులు త్వరలో ప్రారంభించడానికి నీటిపారుదలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ట్యాంకు నిర్మాణం, నీటి నిల్వకోసం మరో 8 వందల ఎకరాల వరకు భూసేకరణ జరగాల్సి ఉందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. కట్ట నిర్మాణం ప్రారంభం జరుగుతుండగానే వీలైనంత త్వరగా కావాల్సిన 8 వందల ఎకరాల భూమిని అధికారులు సమీకరించనున్నారు. సహజ నీటి ప్రవాహం లేని పిప్పల్‌కోటి పిప్పల్‌కోటికి సహజ నీటి ప్రవాహం లేదు. కాని లోయర్ పెన్‌గంగ కెనాల్ ద్వారా ఖరీఫ్‌లో 37వేల 5 వందల ఎకరాలకు నీళ్లదించే పరిస్థితి ఉంటుంది. రబీ సమయం వచ్చేసరికి ఈకెనాల్ ద్వారా నీరు అందించే పరిస్థితి ఉండకపోవడంతో, ఆ సమయంలో పిప్పల్‌కోటి రిజర్వాయర్ ద్వారా నీళ్లు అందించడానికే ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వృథాగాపోతున్న నీటిని పిప్పల్‌కోటి రిజ్వరాయర్‌లో నింపి ఉంచి రబీలో రైతులకు రిజర్వాయర్ ద్వారా నీటి ని ఇవ్వడానికి వీలు పడుతుంది. ఈ రిజర్వాయర్ నుంచి లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కెనాల్‌కు అనుసంధానం చేసి రిజర్వాయర్ నీటిని లోయర్ పెన్‌గంగ కెనాల్ నుంచి దాదాపుగా 37 వేల 5 వందల సాగు నీటిని అందించడానికి అనువుగా డిజైన్ చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో పెన్‌గంగ నీరు వృథాపోకుండా రెండోపంటకు రైతులకు నీరు అందించడానికి రిజర్వాయర్ పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 51 వేయి ఎకరాలకు సాగునీరు పిప్పల్ కోటి రిజర్వాయర్ ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో 51 వేయి ఎకరాలకు సాగు నీరు అందనుంది. లోయర్ పెన్‌గంగ కాలువ కింద ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల, జైన«థ్, ఆదిలాబాద్ మండలాల్లో 37 ,500 ఎకరాలకు, బోథ్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల ద్వారా భీంపూర్, తాంసి మండలాల్లో మరో 13,500 ఎకరాలలో సాగు నీరు అందడానికి అవకాశం ఉంది. రెండు నియోజకవర్గాల్లో ఐదు మండలాల్లో 51 వేయి ఎకరాలకు సాగు నీరు అందేలా రిజర్వాయర్‌కు అధికారులు డిజైన్ చేస్తున్నారు. రూ.368 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలంగాణ ప్రభుత్వం పిప్పట్కోటి రిజర్వాయర్ నిర్మాణంకోసం రూ.368 కోట్లకు ఆమోదం తెలిపింది. రూ.273 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ అయింది. 11–09–2018 సంబంధిత అధికారులు టెండర్లు పూర్తి చేశారు. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా పూర్తికావడంతో ఇక పనులు ప్రారంభం కావడమే తరువాయి. పూర్తయిన అగ్రిమెంట్ పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్మాణంకోసం రూ.368 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు డివిజన్ ఆధికారి రవీందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 2018 సెప్టెం బర్లో రూ.273 కోట్లకు టెండర్లు వేశాం. సంబంధిత కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. కట్టకు సంబంధించిన రెండువందల ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. నీటి నిల్వకోసం మరో 8 వందల ఎకరాల భూ సర్వే చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఇక్కడి ప్రాంతంలో సాగునీటితోపాటు తాగునీరు, భూగర్భజలాలు పెరిగి భవిష్యత్‌లో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. రిజర్వాయర్ భూములను పరిశీలించిన ఆర్డీవో తాంసి: భీంపూర్ మండలం పిప్పల్‌కోటి వద్ద రూ.810 కోట్లతో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌కు సంబంధించిన భూములను ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. ముంపునకు గురయ్యే భూముల సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూములు పరిశీలించి సర్వే నంబర్లు తెలుసుకుని రైతులతో మాట్లాడారు. ముంపునకు భూములు గురయ్యే రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ రిజర్వాయర్‌కు భూములు ఇచ్చే రైతులకు సరైన పరిహారం అందించేలా జిల్లా యంత్రాంగానికి వివరిస్తామని హామీఇచ్చారు. ఆర్డీవో వెంట కార్యక్రమంలో ఆర్ఐ నూర్సింగ్, ల్యాండ్ ఎమ్సీ శ్రీనివాస్, పిప్పల్కొటి గ్రామరైతులు లస్మన్న, గంగయ్య, సంతోష్, రమణారెడ్డి రైతులు ఉన్నారు. -
7న టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన
అంచనా వ్యయం రూ.3000 కోట్లు 3500 ఎకరాల్లో నిర్మాణం ఎమ్మెల్యే టి.రాజయ్య స్టేషన్ ఘన్పూర్ టౌన్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలంలో టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి ఆగస్టు 7న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. సోమవారం స్టేషన్ ఘన్‌పూర్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మసాగర్ మండలంలో 3,500 ఎకరాల్లో రూ.3వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న టెక్స్టైల్ పార్క్‌ను ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేస్తారన్నారు. ఉప్పుగల్లులో రూ. 320 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఈనెల 27న మంత్రి చందూలాల్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే రోజున స్టేషన్ ఘన్పూర్ గిరిజన బాలికల వసతి గృహంలో జరిగే హరితహారం, అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారని పేర్కొన్నారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులు పూర్తయితే నియోజకవర్గం ఆరు రిజర్వాయర్లతో సస్యశ్యామలం అవుతుందన్నారు. -
ఇంతింతై.. ఎనిమిదింతలై..
⇒ పెరగనున్న ‘గౌరవెల్లి’ జలాశయం సామర్థ్యం ⇒ 1.4 నుంచి 8 టీఎంసీలకు పెంపుపై కసరత్తు ⇒ మహాసముద్రం గండి పూడ్చివేతపై దృష్టి ⇒ నేడు సందర్శించనున్న మంత్రి హరీష్‌రావు ⇒ పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితుల డిమాండ్ హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలంలో నిర్మించ తలపెట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై సర్కారు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని సామర్థ్యాన్ని ఎనిమిదింతలు పెంచేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మరిన్ని గ్రామాలు ముంపునకు గురికాకుండా... పెద్దగా ఆర్థిక భారం పడకుండానే ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు అందజేసినట్లు తెలిసింది. కాగా.. గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీ నుంచి 8 టీఎంసీలకు పెంచేందుకు మంత్రి హరీశ్ రావు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలంగాణ వికాస సమితి నాయకులు తెలిపారు. టీవీఎస్ నాయకుల విజ్ఞప్తి మేరకు ఈ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని హరీష్‌రావు గురువారం సందర్శించనున్నారు. తడకలపల్లి టు గౌరవెల్లి.. సిద్దిపేట మండలం తడకలపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీల నుంచి ఇటీవలే అ మాంతం 29 టీఎంసీలకు పెంచారు. ఈ మేరకు రిజర్వాయర్ నిర్మాణ పనులు చురుకుగా కొసాగుతున్నారుు. అక్కడినుంచి నంగునూర్ వరకు కాలువలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యమానేరు లింక్ రిజర్వాయర్ అరుున గౌరవెల్లిని తడుకపల్లితో లింక్ చేసేందుకు ప్రతిపాదన లు రూపొందించారు. నంగునూరుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున గ్రావిటీ ద్వా రా నీటిని తరలించడం కష్టం కాదని భావిస్తున్నా రు. అంతేకాకుండా ఈ పనులు జరిగితే మార్గమధ్యంలో కోహెడ మండలం బస్వాపూర్ చెక్‌డ్యామ్‌లను నింపితే శనిగరం, సింగరాయ జలాశయూలు నిండి కోహెడ మండల సస్యశ్యామలం అవుతుంది. అలాగే గౌరవెల్లి నుంచి కాలువల ద్వారా మల్లంపల్లిలో ఉన్న డిస్ట్ట్రిబ్యూటరీ ద్వారా మీర్జాపూర్, మహాసముద్రం గండిని నింపే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా సైదాపూర్ మండలం ఆకునూర్ చెరువును 1.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌గా మార్చవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. వరద వచ్చినప్పుడే నీళ్లు.. మొదటి ప్రణాళిక ప్రకారం వరద కాలువ నుంచి వరదలు వచ్చినప్పుడే గౌరవెల్లి రిజర్వాయర్ కళకళలాడుతుంది. ఓగులాపూర్ రిజర్వాయర్ పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంతో ఈ పనులు పూర్తయితే గాని గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీళ్లు రావు. ఈ ప్రాజె క్ట్‌లకు బడ్జెట్లో నయా పైసా కేటాయించకపోవడంతో ఇప్పట్లో ఈ పనులు కావనే నమ్మకం ప్రజల్లో నెలకొంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా టీవీఎస్, జేఏసీ నాయకులు మరో ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచినట్లు తెలిపారు. తడకపల్లి నుంచి గ్రావిటీ ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపితే జలకళ ఉట్టిపడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాల్చితే గౌరవెల్లి రిజర్వాయర్‌ను అతి తక్కువ ఖర్చుతో ఎనిమిది టీఎంసీలకు పెంచితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఇంజనీర్లు మంత్రి హారీష్‌రావుకు సూచించినట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకే మంత్రి గురువారం గౌరవెల్లి రిజర్వాయర్, ఉమ్మాపూర్‌లోని మహాసముద్రం గండిని సందర్శించనున్నారు. గండిని పూడ్చితే మూడువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు మంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. ఎనిమిదేళ్లుగా అతీగతీ లేదు.. 2007లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 1.4 టీఎంసీల సామర్థ్యం గ ల గౌరవెల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ఎనిమిదేళ్లలో కేవలం మట్టి కట్ట పనులు మాత్రమే జరిగారుు. రిజర్వాయర్‌లో 2200 ఎకరాల భూములు, గూడాటిపల్లి, మద్దెలపల్లి, తెనుగుపల్లితో పాటు గిరిజన తండాలు ముంపునకు గురవుతున్నాయి. దాదాపు 200 ఎకరాల అస్సైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. 687 ఇళ్లు ముంపునకు గురవుతుండగా ఇటీవల దాదాపు 220 ఇళ్లకు పైగా రూ.28 కోట్లు నిర్వాసితుల అకౌంట్లో జమచేశారు. మిగతా 400పైగా ఇళ్లకు పరిహారం అందించాల్సి ఉంది. పరిహారం సొమ్ముతో కుటుంబ పోషణ రిజర్వాయర్ పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితుల తిప్పలు అన్నీఇన్నీ కావు. వ్యవసాయ భూములను బొందల గడ్డలుగా మార్చడంతో సాగు చేసుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కరువై.. సర్కా రు ఇచ్చిన పరిహారం సొమ్ముతోనే కుటుంబాన్ని పోషించుకునే దుస్థితి నెలకొంది. ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం డబ్బులతో ఎకరం భూమి కూడా కొనలేరు. ఇప్పటికీ పునరావాసానికి స్థలం లేదు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించాలని మంత్రిని కోరనున్నట్లు యువకులు పేర్కొంటున్నారు. ముందు భూనిర్వాసితుల పరిహారంతో పాటు సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు మంత్రిని కోరనున్నారు.