వరంగల్లో అతి పెద్ద టెక్స్‌టైల్ పార్క్
- దేశంలోకెల్లా అతి పెద్దది
- ఏప్రిల్ చివర్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన
- కడియం, కేటీఆర్,చందూలాల్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను వరంగల్‌లో ‘కాకతీయ’ పేరుతో ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. దీనిపై బుధవారం కడియం నేతత్వంలో మంత్రులు కేటీఆర్, చందూలాల్, ఎంపీ దయాకర్, స్థానిక ఎమ్మెల్యేలతో సమీక్ష జరిపారు. ఈ టెక్స్‌టైల్ పార్కుకు ఏప్రిల్ నెలాఖరులో సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారని మంత్రులు చెప్పారు. ‘‘పార్కులో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఇన్వెస్టర్ల క్షేత్ర స్థాయి పర్యటన ఉంటుం ది. స్థానికులకే ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లభిస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రత్యే క కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శంకు స్థాపన నాటికి పార్క్ రోడ్డు, ముఖద్వారాల అభివద్ధిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్ అవసరాలను పూర్తిగా తీర్చేలా ఎస్సారెస్పీ నుంచి నీటి వసతి, ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటుచేయాలని సూచించారు. చేనేత కార్మికులకు భారీగా ఉపాధి అవకాశాలతోపాటు పరిసర అసెంబ్లీ నియో జకవర్గాల వారికీ ఉపాధి కల్పించేలా పార్కు అభివద్ధి చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దారం నుంచి వస్త్రం దాకా అన్నీ టెక్స్‌టైల్ పార్క్‌లోనే తయారయేలా ఏర్పాటు చేయాలని సీఎం ఆకాం క్షిస్తున్నారన్నారు. కార్మికుల ఆవాసానికి క్వార్టర్లు, చుక్క కాలుష్యం కూడా బయటకు రాకుండా అత్యాధునిక కాలుష్య నివారణయంత్రాన్ని పార్కు లోనే ఏర్పాటు చేయడం, భారీ వాహనాల కోసం 150 అడుగుల రోడ్ల అభివద్ధి వంటివి చేపడతామన్నారు.
వరంగల్ సుందరీకరణ
వరంగల్‌లో ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ, భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నగర సుందరీకరణ చేయాలని అధికా రులను కడియం, కేటీఆర్, చందూలాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ‘‘నెలలోగా రోడ్లను అందంగా తీర్చిదిద్దండి. భారీగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయండి. ముఖ్యంగా వీలైనన్ని చోట్ల షీ టాయిలెట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి’’ అని సూచించారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వరంగల్ నగరానికి నాలుగు వైపుల భూ సేకరణ చేపట్టాల న్నారు.
ఈ భూమిని భావి అవసరాలకు ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. స్థానిక సాక్షి కార్యాలయం నుంచి మడికొండ వరకున్న రోడ్డు, స్టేషన్ ఘన్‌పూర్ హెడ్‌క్వార్టర్ రోడ్లను నెలలోపు అభివద్ధి చెయ్యాలని కడియం ఆదేశించారు. అసెంబ్లీలో జరిగిన ఈ సమీక్షల్లో వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.