బంగ్లాదేశ్ సంక్షోభంతో టెక్స్‌టైల్ రంగంలో తీవ్ర మార్పులు
ఇండియా వైపు చూస్తున్నదుస్తుల తయారీ కంపెనీలు
రాష్ట్రానికి అందివచ్చిన అవకాశం
తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్,తెలంగాణ నుంచి పోటీ
రాష్ట్రంలో అభివృద్ధికి అపార అవకాశాలు
ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగాన్ని ప్రోత్సహించాలి
నైపుణ్య శిక్షణ, టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలి
సాక్షి, అమరావతి : కోవిడ్ సంక్షోభంతో తయారీ రంగం చైనా నుంచి ఇండియాకు ఏ విధంగా మారుతోందో.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ సంక్షోభం దేశంలోని టెక్స్‌టైల్ రంగానికి సదవకాశాన్ని అందిస్తోంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇదో మంచి చాన్స్‌గా టెక్స్‌టైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మంచి వనరులు, ఎగుమతికి అన్ని అవకాశాలు ఉన్న మన రాష్ట్రంలో దుస్తుల తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను తయారు చేసి, ఎగుమతి చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో దుస్తుల తయారీ, సంబంధిత పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ల దుస్తులు అత్యధికంగా బంగ్లాదేశ్‌లోనే తయారవుతుంటాయి. ఈ దేశం నుంచి నెలకు సగటున రూ.31,540 కోట్లు విలువచేసే దుస్తులు ఎగమతి అవుతుంటాయి. అంటే ఏటా 3.60 లక్షల కోట్లకు పైగా విలువైన ఎగుమతులు ఒక్క టెక్స్‌టైల్ రంగంలోనే ఉంటాయి. బంగ్లాదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, కర్ఫ్యూ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ప్రపంచ టెక్స్‌టైల్ రంగం ఉలిక్కిపడింది.
ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియా వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం అందిపుచ్చుకున్నా ఇండియా నుంచి ప్రతి నెలా రూ.3,320 కోట్ల ఎగుమతులు అదనంగా చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయని, బంగ్లాదేశ్ సంక్షోభంతో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.
దీర్ఘకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం
బంగ్లాదేశ్ సంక్షోభాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంటే రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అనకాపల్లిలో బ్రాండిక్స్, పులివెందులలో బిర్లా గార్మెంట్స్ తప్ప అతిపెద్ద గార్మెంట్స్ తయారీ సంస్థలు లేవు. కోవిడ్ తర్వాత ఎల్రక్టానిక్స్, ఫార్మా రంగాల్లో పీఎల్‌ఐ స్కీం కింద రాష్ట్రం అవకాశాలు అందిపుచ్చుకున్న విధంగానే ఇప్పుడు గార్మెంట్స్ రంగంలో అందివచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైన వనరులన్నీ రాష్ట్రంలో ఉన్నాయని చెబుతున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ సంక్షోభం స్వల్పకాలంలో రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలకు ఇబ్బందులకు గురి చేసినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టెక్స్‌టైల్ మాన్యుఫాక్చరింగ్ డైరెక్టర్ సుధాకర్ చౌదరి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం బంగ్లా సంక్షోభంతో తమిళనాడులోని తిరుపూర్, పంజాబ్‌లోని లూథియానా బాగా ప్రయోజనం పొందుతాయని చెబుతున్నారు. బంగ్లా సంక్షోభం ప్రభావం వల్ల నూలు ఎగుమతులు కొంతమేరకు దెబ్బతిని, స్పిన్నింగ్ మిల్లులు ఇబ్బందుల్లో పడ్డాయి.
కొంత కాలంగా రాష్ట్ర టెక్స్‌టైల్ అమ్మకాలు అంతంతగానే ఉంటున్న సమయంలో బంగ్లాదేశ్ సంక్షోభం మరింతగా భయపెట్టినా, వెంటనే సమసి పోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యాదర్శి మల్లేశ్వర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో పత్తి బేళ్లు, యార్న్ బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయని, అదే దేశీయంగా గార్మెంట్ పరిశ్రమలు వస్తే స్థానికంగానే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.
టెక్స్‌టైల్ రంగంలో తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉందని, దీన్ని తట్టుకునేలా టెక్స్‌టైల్స్ పాలసీలో ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ, టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 21,000 మంది పనిచేస్తున్న బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ పార్కు, వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రముఖ బ్రాండ్ల గార్మెంట్స్ తయారు చేసే ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్. ఇవి కాకుండా అరవింద్, వర్థమాన్, గోకుల్‌దాస్, ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్,టోరే, షోర్ టు షోర్, యూనిచార్మ్, వంటి ప్రముఖ బ్రాండ్ల యూనిట్లు ఉన్నాయి.
ఏపీ టైక్స్‌టైల్స్ రంగం
ఏటా 5,970 టన్నుల పట్టు (సిల్‌్క) ఉత్పత్తితో దేశంలోరెండో స్థానం
ఏటా 19 లక్షల బేళ్ల పత్తినిఉత్పత్తితో దేశంలో ఏడో స్థానం
ఏటా 3.6 కోట్ల స్పిండిల్స్ తయారు చేస్తూ ఈ రంగంలో ఏపీ 7% వాటా కలిగి ఉంది
100రాష్ట్రంలో స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్‌కంపెనీలు
18,000పవర్‌లూమ్స్,23 ప్రోసెసింగ్‌యూనిట్లు,653 చేనేతరెడిమేడ్ గార్మెంట్స్ యూనిట్లు ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment