పెదవేగి : చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టెక్స్‌టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్‌ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తయారైన చేతివృత్తుల వస్తువులకు ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉందని, చేతివృత్తుల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు వస్తువుల తయారీపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి మాణిక్యాలరావు, ఎస్‌ఎంసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రామన్న, పాఠశాల హెచ్ ఎం ఉషారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment