హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం హెటిరోకి చెందిన ’నిర్మాకామ్’ (నిర్మాట్రెల్‌విర్) నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీక్వాలిఫికేషన్ (డబ్ల్యూహెచ్‌వో పీక్యూ) ఆమోదముద్ర లభించింది. ఈ ఔషధాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక మైలురాయని కంపెనీ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు.
భారత్‌తో పాటు 95 అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో నిర్మాకామ్‌ను మరింత వేగంగా, చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే ఫైజర్ ఔషధం ప్యాక్స్‌లోవిడ్‌కు ఇది జనరిక్ వెర్షన్. నిర్మాట్రెల్‌విర్ 150 మి.గ్రా.(2 ట్యాబ్లెట్లు), రిటోనావిర్ 100 మి.గ్రా.(1 ట్యాబ్లెట్) అనే 2 యాంటీవైరల్ ఔషధాలు ఈ ప్యాక్‌లో ఉంటాయి.
దీని తయారీ, విక్రయానికి సంబంధించి మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ) నుంచి స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తెలిపింది. ఈ లైసె న్స్ కింద జనరిక్ వెర్షన్‌ను రూపొందించిన తొలి సంస్థ హెటిరో కావడం ప్రశంసనీయమని ఎంపీపీ ఈడీ చార్లెస్ గోర్ తెలిపారు. దేశీయంగా అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment