![Suven Life inks pact to buy assets of Aceto's Rising Pharma units - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/9/Untitled-7.jpg.webp?itok=jPuKDnoO)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ సువెన్ లైఫ్ సైన్సెస్... యూఎస్ సంస్థ ఎసిటో కార్పొరేషన్‌కు చెందిన రైజింగ్ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు అనుబంధ కంపెనీల ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.105 కోట్లు చెల్లించేందుకు సువెన్ అంగీకరించిందని ఎసిటో వెల్లడించింది.
ఎసిటో దివాలా తీయడంతో కోర్టు ఆమోదించిన బిడ్డింగ్ విధానంలో ఆస్తులను విక్రయిస్తోంది. సువెన్ లైఫ్ జేవీ అయిన షోర్ సువెన్ ఫార్మా ద్వారా ఈ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ ద్వారా యూఎస్‌లో షోర్ సువెన్ పటిష్టమైన జనరిక్ ఫార్మా కంపెనీగా మారుతుందని సువెన్ లైఫ్ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment