న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.296 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ3లో రూ.88 కోట్ల నికర లాభం ఆర్జించామని ఈ కంపెనీ తెలిపింది. ఆదాయం రూ.749 కోట్ల నుంచి రూ.795 కోట్లకు పెరిగింది. ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని స్డ్రైడ్స్ ఫార్మా సైన్స్ వ్యవస్థాపకులు, గ్రూప్ సీఈఓ అరుణ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆరో ఫార్మాస్యూటికల్స్‌లో వాటాను రూ.2,000 కోట్లకు తమ అనుబంధ సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా గ్లోబల్ పీటీఈ విక్రయించనున్నదని వివరించారు. వివిమెడ్‌తో ఈ కంపెనీ ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్‌లో వాటాను వంద శాతానికి పెంచుకోనున్నదని పేర్కొన్నారు.
మరోవైపు అమెరికాకు చెందిన వెన్సమ్ ఫార్మాలో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి తమ మరో అనుబంధ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా ఇన్‌కార్పొ ఒక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. అలాగే ఫార్మాపర్ ఇన్‌కార్పొలో 80 శాతం వాటాను 40 లక్షల కెనడా డాలర్లకు కొనుగోలు చేయడానికి మరో అనుబంధ కంపెనీ, స్ట్రైడ్స్ ఫార్మా కెనడా ఇన్‌కార్పొ ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేర్ 2.5% నష్టపోయి రూ.492 వద్ద ముగిసింది.
స్ట్రైడ్స్ ఫార్మా లాభం రూ.296 కోట్లు
Published Wed, Jan 30 2019 1:08 AM | Last Updated on Wed, Jan 30 2019 1:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment