ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివారం అధికారులు పరిశీలించారు.
ఆమనగల్లు: ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివారం అధికారులు పరిశీలించారు.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఐఐసీ ఎండీ జేఎస్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ హైదరాబాద్ నుండి హెలికాప్టర్‌లో ఇక్కడికి వచ్చారు. రంగారె డ్డి జిల్లా ముచ్చర్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని పరిశీలించారు.
రంగారెడ్డి కలెక్టర్ శ్రీధర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ప్రియదర్శినిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ 3 జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతంలో ఫార్మా సిటీ, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 3న సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వే చేయనున్నారు.