
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ బాధితులను రేపు (శుక్రవారం) వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు.
బుధవారం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రేపు ఉదయం 11 గంటలకు పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు.
ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం తిరుగు పయనమవుతారు
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
అంతకు ముందు అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని,సానుభూతిని తెలిపారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024