సాక్షి, హైదరాబాద్ : భువనగిరి పారిశ్రామిక ప్రాంతంలోని రీచ్ ఇండియా ఫార్మాకు ఆస్ట్రేలియా ప్రభుత్వ వైద్య విభాగం థెరఫాటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (టీజీఏ) అందించే గుడ్ మాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ (జీఎంపీ) సర్టిఫికేట్ లభించింది. ఈ సర్టిఫికేట్ ద్వారా తమ సంస్థ ఆస్ట్రేలియా సహా 50కి పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుందని రీచ్ ఇండియా ఫార్మా సంస్థ ఎండీ శ్యాంసుందర్ చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) రంగంలో ఈ సర్టిఫికేషన్ కేవలం తమ సంస్థకే దక్కిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టే చర్యలతోనే ఈ ప్రగతి సాధ్యమైందని, రాబోయే రోజుల్లో స్ధానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఫార్మా రంగంలో ప్రత్యేకమైన స్ధానాన్ని పొందడానికి తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
చదవండి : ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష కోట్ల నిధి
Comments
Please login to add a commentAdd a comment