
లాభాల స్వీకరణతో మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., శుక్రవారం ఉదయం సెషన్‌లో ఫార్మా షేర్ల దూకుడు కొనసాగుతోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ ఎక్చ్సేంజ్‌లో ఒక్క నిఫ్టీ ఇండెక్స్ మాత్రమే లాభాల్లో కదులుతుంది. నేడు ఈ ఇండెక్స్ 10,382 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఇండెక్స్ ఒక దశలో 1.50శాతం లాభపడి 10476 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్ నిన్నటి ముగింపు (10,322)తో పోలిస్తే అరశాతం లాభంతో 10375 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా సన్‌ఫార్మా 3.50శాతం లాభపడింది. కేడిల్లా హెల్త్‌కేర్ 1.50శాతం, డాక్టర్ రెడ్డీస్ షేరుఅరశాతం పెరిగింది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో బయోకాన్ 1శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. దీవీస్ ల్యాబ్స్, సిప్లా, ఆల్కేమ్ ల్యాబ్స్ షేర్లు అరశాతం నష్టాన్ని చవిచూశాయి. అలాగే అరబిందో ఫార్మా, లుపిన్, టోరెంటో ఫార్మా షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పతనమయ్యాయి.