టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డి | Naresh Reddy Appointed As TPCC NRI Gulf Cell Convenor | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డి

Published Mon, Jun 27 2022 9:00 PM | Last Updated on Tue, Jun 28 2022 7:02 AM

Naresh Reddy Appointed As TPCC NRI Gulf Cell Convenor - Sakshi

జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీసీసీసీ) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డాక్టర్‌ బీఎం వినోద్ కుమార్  ఈమేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్ లో అందజేశారు.  ఈ సందర్భంగా నరేష్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  అభినందించారు. గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది... గల్ఫ్ కార్మికుల బాధలు తీరుస్తుందని  హమీ ఇచ్చారు.  

నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్ గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీ లోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్ గా పనిచేశారు. 'సౌదీ అరామ్కో' కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు. 

ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ..  "తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ లతో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది" అని అన్నారు. 
 

చదవండి: గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement