తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో సప్త ఖంఢ అవధాన సాహితీ ఝర అనే కొత్త ప్రక్రియకి వద్దిపర్తి పద్మాకర్ శ్రీకారం చుట్టారు. అందులో ఇప్పటికే వర్చువల్‌గా 11 అష్టావధానాలు పూర్తయ్యాయి. 12వ అవధానం కెనడాలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు. వీరితో పాటు పెరూ నుంచి శ్రీనివాస్ పోలవరపు సైతం ఈ అవధానంలో భాగమయ్యారు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ అవధానం సాహితీ ప్రియులు ఆకట్టుకుంది. ఈ అవధానం తిలకించిన శ్రీ కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ, పద్మాకర్‌ను ఆశీర్వదించారు.
వద్దిపర్తి పద్మాకర్ ఇప్పటి వరకు 1242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు పూర్తి చేశారు. తెలుగు, సంస్కృతం, హిందీలలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు వద్దిపర్తి పద్మాకర్‌ను గుర్తించాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు బింగి నరేంద్ర గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎం విజయలక్ష్మి మురుసుపల్లి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ సాయి శ్రీ, ఏలూరు జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ శివశంకర్ తదితర ప్రతినిధులు వద్దిపర్తి పద్మాకర్కి సర్టిఫికెట్, మెడల్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment