అట్లాంట: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెలుగులో భాగంగాఫిబ్రవరి 27న, 33 వ అంతర్జాల దృశ్య సమావేశం తెలుగు తల్లికిపద్యాభిషేకం అనే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించగల శక్తి పద్యానికున్నదంన్నారు. పద్యం రాయగలగడం ఒక ప్రత్యేక కళ అన్నారు. ఈ నాటి కార్యక్రమంలో ఇంతమంది లబ్దప్రతిష్ఠులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూరమాట్లాడుతూ ఏ ఇతర భాషలకూ లేనిపద్యం, అవధానంలాంటి సౌందర్యం, సొగసులు మన తెలుగు భాషకున్నాయన్నారు. ఇంతటి ఘనమైన మన మాతృభాషా పరిరక్షణ కోసం తానా కంకణం కట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తున్నదని తెలిపారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ మాట్లాడుతూ సాహిత్యలోకంలో అంతగా ప్రచారంలో లేని ప్రముఖ యోగిని, గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ కలం నుండి భాగవతం, వేంకటాచల మహత్యం, రమా పరిణయం, యక్షగాన కృతులు, శివ నాటకం లాంటి అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయని తెలిపారు. 12 స్కందాల భాగవతంలో 7, 8, 9, స్కందాలు అలభ్యంగా ఉన్నాయని, వాటి కోసం శోధించవలసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అక్కిరాజు సుందర రామకృష్ణ, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి, తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణి శయనసూరి, పాతూరి కొండల్ రెడ్డి, గాయకులు చంద్ర తేజ, తాతా బాలకామేశ్వర రావులతో పాటు పలువురు సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment