ఉక్రెయిన్‌లో యుద్ధరంగంలో చిక్కుకుపోయిన 16 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్‌లతో పాటు రోమేనియా ప్రభుత్వాలతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు ప్రారంభించారు.
ఉక్రెయిల్‌లో ప్రస్తుతం రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే సాగుతున్నాయి. యూరప్ దేశాలపైవు ఉన్న పశ్చిమ ప్రాంతంలో దాడులు తక్కువగా ఉన్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాలకు పాస్‌పోర్ట్ ఇతర డాక్యుమెంట్లతో రావాలంటూ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం సూచించింది. ఇందుకు అనుగుణంగా ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులో ఉన్న హంగరీ, రోమేనియా, స్లోవేకియా, పోలాండ్‌లతో చర్చలు ప్రారంభించింది.
సహరిస్తాం
ఉక్రెయిన్ నంచి భారతీయుల తరలింపుకు సంబంధించి ఆ దేశ మంత్రి ఇవాన్ కుర్కోవ్‌తో జైశంకర్ మాట్లాడారు. తమ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు పూర్తి సహయసహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. అయితే నో ఫ్లై జోన్ ఉన్నందున దేశ సరిహద్దుల నుంచి తరలింపును ఇండియా చూసుకోవాల్సి ఉంది.
డెబ్రికెన్ కీలకం
ఉక్రెయిన్ సరిహద్దుల వరకు వచ్చిన ఇండియన్లను తరలించే విషయంలో హంగరీ ప్రభుత్వ సాయం కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి పీటర్ షిజార్టో చర్చలు జరపగా ఆ దేశంలోని డెబ్రికెన్ ప్రాంతం నుంచి భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామంటూ హమీ పొందారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్ తర్వాత ఆ దేశంలో రెండో పెద్ద నగరం డెబ్రికెన్. చర్చలు పూర్తి స్థాయిలో ఫలించి ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైతే ఈ నగరం కీలకం కానుంది.
Reached out to my friend FM Péter Szijjártó of Hungary on the Ukraine evacuation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 24, 2022
He has promised full cooperation to facilitate evacuation from Debrecen. Thank him for his understanding.
మేమున్నాం
భారతీయుల తరలింపు విషయంలో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు యూరోపియన్ యూనియన్‌తో కూడా మన దేశ మంత్రులు, అధికారులు మాట్లాడుతున్నారు. తమ దేశం మీదుగా ఇండియన్ల తరలింపుకు అడ్డు చెప్పబోమని స్లోవేకియా హామీ ఇచ్చింది. కాగా సాధ్యమైనంత త్వరగా సుళువుగా చేపట్టాల్సిన తరలింపు ప్రక్రియపై ఈయూతో మన అధికారులు చర్చిస్తున్నారు.
కొలిక్కి రావాలి
ఉక్రెయిన్ విస్త్రీర్ణం విశాలంగా ఉండటంతో అనేక దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి పశ్చిమ దిశగా ఉన్న ఇతర దేశాలకు దగ్గరగా ఉన్నవి ఎన్ని ? ఇందులో ఎయిర్‌లిఫ్ట్‌కి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఏవీ అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది.
Received a call from EU HRVP @JosepBorrellF.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 24, 2022
Discussed the grave situation in Ukraine and how India could contribute to de-escalation efforts.
ఎంత కాలం
తరలింపకు సంబంధించి ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు ఎక్కడి ఎలా రావాలనే సూచనలు చేయడంతో పాటు.. వచ్చిన వారిని వెంటనే తీసుకువచ్చేలా లాజిస్టిక్స్ సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు అనేక దేశాలతో చర్చలు జరిపి వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో స్పష్టత వచ్చాకా తరలింపు ప్రక్రియ ముందుకు వెళ్లనుంది.
చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 16 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు
Comments
Please login to add a commentAdd a comment