
బతుకుదెరువు కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ప్పు చేసిన సొమ్ముతో రెస్టారెంట్ ప్రారంభించారు. నాలుగు రాళ్లు సంపాదించి ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు పంపిద్దాం అనుకన్నాడు. అప్పులు తీరకముందే యుద్ధం రూపంలో ప్రమాదం వచ్చిపడింది. కానీ ధైర్యం కోల్పేదా వ్యక్తి.. కష్టకాలంలో తనలాంటి ఎందరో వ్యక్తులకు అండగా నిలిచాడు. విపత్కర పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం విలువేంటో చాటి చెప్పాడు.
మనీష్ దవే గుజరాత్‌లోని వడోదర నివాసి. స్వహతగా వ్యాపారవేత్త. ఇటీవల మెడిసన్ చదివేందుకు ఉక్రెయిన్ మన వాళ్లు ఎక్కువగా వెళ్తున్న విషయం గమనించాడు. వెంటనే అప్పు చేసిన సొమ్ముతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి చేరుకున్నాడు. 2021లో సాతియా పేరుతో ఇండియన్ రెస్టారెంట్ స్థాపించాడు. పొరుగు దేశంలో మన వాళ్లకు ఓ కామన్ వేదికగా నిలిచాడు.
రెస్టారెంట్ కోసం చేసిన అప్పులు ఇంకా తీరక ముందే రష్యా రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలెట్టింది. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా వచ్చి పడ్డ కష్టంతో స్థానికులైన ఉక్రెయిన్ పౌరులే బిక్కటిల్లిపోతున్నారు. మరి దేశం కాని దేశంలో ఉన్న ఇండియన్ల పరిస్థితి ఏంటీ? యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నో ప్లై జోన్‌గా ప్రకటించాక.. రాజధాని కీవ్‌లో ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారికి అన్నీ తానై నిలిచాడు మనీశ్ దవే. తన రెస్టారెంట్ సాతియాను దానికి అనుబంధంగా ఉన్న బంకర్‌ను ఇండియన్ల స్థావరంగా మార్చేశాడు. అప్పటికే ఈ రెస్టారెంట్ గురించి తెలిసిన ఇండియన్ స్టూడెంట్లు సాతియాకి చేరుకున్నారు. అంతా బంకర్లలోనే తలదాచుకున్నారు. వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఆహారం కూడా అందించాడు మనీశ్.
ఇలా వచ్చిన ఆశ్రయం పొందుతున్న వారి కష్టాలు విన్న మనీశ్ చలించిపోయాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆశ్రయం ఆహారం లేక ఇబ్బంది పడుతున్న ఇండియన్లతో పాటు ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్లు సైతం సోషల్ మీడియాలో సాతియా గురించి వివరించారు. దీంతో మొత్తంగా 132 మందికి తన రెస్టారెంట్‌లో ఆశ్రయం కల్పించాడు మనీశ్.
మనీశ్ దగ్గర ఆశ్రయం పొందిన విద్యార్థులు ఇండియన్ ఎంబసీ సూచనలకు అనుగుణంగా ఇటీవల ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నారు. విడతల వారీగా ఇండియాకి వస్తున్నారు. కీవ్ నగరంలో మన విద్యార్థులు ఎవరూ లేరని తాజాగా ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రకటించారు.
ఎన్నాళ్లు యుద్ధం కొనసాగుతుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో తన ఇంటిలో వందల మందికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అందమందికి ఆహారం సమకూర్చి మానవత్వం చాటుకున్నాడు మనీశ్. అతను చేసిన పని గురించి తెలుసుకున్న నెటిజన్లు పుతిన్‌ను ఏకీ పారేస్తున్నారు. యుద్ధం ప్రాణాలు తీస్తుందని మానవత్వం ప్రాణాలు పోస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా యుద్ధం ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment